రూ.90 దాటిన లీటర్ పెట్రోల్

పెట్రోల్ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తొలిసారి లీటర్ పెట్రోల్ ధర రూ.90 దాటింది.

news18-telugu
Updated: September 24, 2018, 10:33 AM IST
రూ.90 దాటిన లీటర్ పెట్రోల్
ప్రతీకాత్మక చిత్రం..
  • Share this:
పెట్రోల్... ఈ మాట వింటే వామ్మో అనేస్తున్నారు వాహనదారులు. ఎందుకంటే పెట్రోల్ ధరలు ఆస్థాయిలో పెరుగుతున్నాయి మరి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90 దాటేసింది. సెంచరీకి చేరుకోవడానికి ఇంకో రూ.10 దూరంలో ఉంది పెట్రోల్ ధర. ఇలాగే ధరలు పెరిగితే ఈ ఏడాదిలోనే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్క్ తాకడం కష్టమేమీ కాదు.

ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.08. హైదరాబాద్‌లో రూ.87.58. ఢిల్లీలో రూ.82.72. కోల్‌కతాలో రూ.84.44. ఇక ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.78.58. హైదరాబాద్‌లో రూ.80.46. ఢిల్లీలో రూ.74.02. కోల్‌కతాలో రూ.84.44. గత ఐదు నెలల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.4.66, డీజిల్‌పై రూ.6.35 ధర పెరిగింది.

ఆగస్ట్ రెండో వారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఓవైపు రూపాయి విలువ దారుణంగా పడిపోతుండటం, మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు నాన్‌స్టాప్‌గా పెరుగుతున్నాయి. మరి ఈ ధరల షాక్‌కు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?పెట్రోల్ కొంటారా? పేటీఎం సూపర్ ఆఫర్!
First published: September 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>