మరింత తగ్గినున్న పెట్రోల్, డీజిల్ ధరలు...ఎందుకో తెలుసా?

కొత్త సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గనున్నాయి. అటు సబ్సిడీ గ్యాస్ ధర, నాన్ సబ్సిడీ గ్యాస్ ధరలు కూడా దిగిరానున్నాయి. దీనికి పలు అంతర్జాతీయ అంశాలు కారణం కానున్నాయి.

news18-telugu
Updated: January 2, 2019, 11:10 AM IST
మరింత తగ్గినున్న పెట్రోల్, డీజిల్ ధరలు...ఎందుకో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొత్త సంవత్సరంలో వాహనదారులకు గుడ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో దేశంలో క్రమంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. కొత్త సంవత్సరాది మంగళవారం రోజున లీటర్ పెట్రోల్ ధరను 19 పైసలు, డీజిల్ ధరను 20 పైసలు మేర చమురు మార్కెటింగ్ సంస్థలు తగ్గించాయి. కాగా బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలు యధాతథంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం రోజున లీటర్ పెట్రోల్ ధర రూ.73.01గా, డీజిల్ ధర రూ.68.32గా ఉంది. లీటరు పెట్రోల్, డీజిల్ ధర గత వారం రోజుల్లోనే ఏకంగా రూ.1.50 మేర తగ్గింది.

అక్టోబర్ 18 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా దిగివస్తూనే ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు పెట్రోల్‌పై లీటరుకు రూ.14.38, డీజిల్‌పై రూ.13.24 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలను అనుగుణంగా చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి రోజూ డీజిల్, పెట్రోల్ ధరలను సవరిస్తుండడం తెలిసిందే.

71 లీటర్ల పెట్రోల్ ఫ్రీ... ఎలా పొందాలో తెలుసుకోండి... | Get 71 litres of petrol free for one year on Citibank Titanium Credit Card, Know How
ప్రతీకాత్మక చిత్రం


అమెరికా క్రూడాయిల్ ఉత్పత్తిని పెంచడం, ఆర్థిక మాంధ్యం భయాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు ముందు ముందు మరింత దిగివచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అటు సబ్సిడీ వంట గ్యాస్, సబ్సిడీ లేని వంట గ్యాస్ ధరలు కూడా ముందు ముందు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

ATF fuel
ప్రతీకాత్మక చిత్రం


ఏడాది కాలంలో కనిష్ఠ స్థాయికి ఏటీఎఫ్ ధరలు...

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో అటు విమాన ఇంధనం(ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్) ధర కూడా భారీగా తగ్గుతోంది. ఏటీఎఫ్ ధర మంగళవారం రికార్డు స్థాయిలో 14.7 శాతం మేర తగ్గించారు. ఏటీఎఫ్ ధరను కిలో లీటర్‌(1000 లీటర్లు)కు  రూ.9,900 తగ్గించడంతో రూ.58,060.97గా ఉంది. అంటే లీటరు ఏటీఎఫ్ ధర...పెట్రోల్, డీజిల్ ధర కంటే తక్కువగా కేవలం రూ.58.07గా ఉంది. డిసెంబరు 1న కూడా ఏటీఎఫ్ కిలో లీటర్ ధరను రూ.8,327.83(10.9శాతం) తగ్గించారు. దీంతో ఏడాదికాలంలో కనిష్ట స్థాయికి ఏటీఎఫ్ ధర చేరింది.  అధిక చమురు ధరలు, రూపాయి క్షీణితతో అప్పుల ఊబిలో కూరుకపోతున్న విమానయాన సంస్థలకు ఇది భారీ ఊరట కలిగించే అవకాశం ఉంది.
First published: January 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading