మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. గత ఏడు రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

దాదాపు మూడు నెలల పాటు పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం సంగతేమో గానీ కనీసం ఉన్న ధరలకే వాహనదారులెవ్వరూ కొనలేని పరిస్థితి. రవాణ రంగం దాదాపుగా నిలిచిపోవడంతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గాయి.

  • Share this:
    కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్ వల్ల పెట్రోల్, డీజిల్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఒకానొక దశలో బంకుల్లోని సిబ్బంది వేతనాలు చెల్లించక నిర్వహణ ఖర్చులు భరించలేక బంకులను మూసేంత పని అయ్యింది. దాదాపు మూడు నెలల పాటు పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం సంగతేమో గానీ కనీసం ఉన్న ధరలకే వాహనదారులెవ్వరూ కొనలేని పరిస్థితి. రవాణ రంగం దాదాపుగా నిలిచిపోవడంతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గాయి. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో వాహనాలు మళ్లీ రొడ్డెక్కాయి. దీంతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మొదలయ్యింది. అందులో భాగంగానే డీజిల్, పెట్రోల్ ధరలు వరుసగా ఏడో రోజూ పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై రూ.59 పైసలు, డీజిల్‌పై 58 పైసల వరకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి.

    దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు 59 పైసల నుంచి 61 పైసలకు పెరగ్గా, డీజిల్ ధర లీటరుకు 50 పైసల నుంచి 60 పైసలు పెరిగింది. ఈలెక్కన చూస్తే గత ఏడు రోజుల్లో పెట్రోలుపై రూ.3.90 పైసలు, డీజిల్‌పై రూ.4 పెరిగింది. ఢిల్లీలో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.74.57 ఉంటే.. అది ఈరోజు రూ.75.16కు చేరింది. డీజిల్ ధర శుక్రవారం రూ.72.82గా ఉంటే.. అది శనివారానికి రూ.73.39గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ రూ.82.10, డీజిల్ రూ.72.03, చెన్నై విషయానికొస్తే లీటరు పెట్రోల్ రూ.78.99, డీజిల్ రూ.71.64, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ రూ.77.05, డీజిల్ రూ.69.23గా ఉంది.
    Published by:Narsimha Badhini
    First published: