వరుసగా తగ్గుతూ వస్తోన్న ఇంధన ధరలు.. నేడు స్వల్ప తగ్గుదల

గత నెల అక్టోబర్ 16వ తేదీ వరకు ప్రతీరోజూ పెరుగుతూ వచ్చిన ధరలు.. 18వ తేదీ నుంచి స్వల్పంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.


Updated: November 5, 2018, 10:17 AM IST
వరుసగా తగ్గుతూ వస్తోన్న ఇంధన ధరలు.. నేడు స్వల్ప తగ్గుదల
ప్రతీకాత్మక చిత్రం..

Updated: November 5, 2018, 10:17 AM IST
పెట్రో, డీజిల్ ధరల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం ఇంధన ధరలు స్వల్ప మేర తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.78.56, లీటరు డీజిల్ ధర రూ.73.16గా ఉంది. ఆదివారంతో పోలిస్తే పెట్రోల్‌పై 22పైసలు, డీజిల్ 20 పైసలు తగ్గింది.

ఇక ముంబైలో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ.84.06, డీజిల్ ధర రూ.76.67గా నమోదైంది. ఆదివారంతో పోలిస్తే పెట్రోల్‌పై 22 పైసలు, డీజిల్‌పై 21 పైసలు తగ్గింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల రేట్లు తగ్గడం వల్లే పెట్రో, డీజిల్ ధరలు తగ్గుతున్నట్టుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.గత నెల అక్టోబర్ 16వ తేదీ వరకు ప్రతీరోజూ పెరుగుతూ వచ్చిన ధరలు.. 18వ తేదీ నుంచి స్వల్పంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అంతకుముందు అక్టోబర్ 4న పెట్రో, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. అదే రోజు పెట్రో, డీజిల్‌పై కేంద్రం రూ.1.50మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

First published: November 5, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...