గుడ్ న్యూస్...మరింత తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ 21 పైసలు తగ్గి రూ.78.78గా ఉండగా...డీజిల్ 17పైసలు తగ్గి రూ.73.36గా ఉంది.

news18-telugu
Updated: November 4, 2018, 9:19 AM IST
గుడ్ న్యూస్...మరింత తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో మన దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఆదివారం కూడా ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ 21 పైసలు తగ్గి రూ.78.78గా ఉండగా...డీజిల్ 17పైసలు తగ్గి రూ.73.36గా ఉంది. శనివారం కూడా లీటరు పెట్రోల్‌పై 19 పైసలు, డీజిల్‌ 11 పైసలు తగ్గింది. అటు ముంబైలో ఆదివారం పెట్రోల్ 21 పైసలు తగ్గి రూ.84.28గా ఉండగా...డీజిల్ 18 పైసలు తగ్గి రూ.76.88గా ఉంది. తగ్గిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి.

ఇంధన ధరలు క్రమంగా తగ్గుతున్నా...ఇంకా ధరలు సామాన్య ప్రజలకు అందనంత ఎత్తులోనే ఉంది. ఇది మరింత దిగిరావాలని వాహనదారులు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

First published: November 4, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...