నేడు స్వల్పంగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు..

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల రేట్లు తగ్గడం వల్లే పెట్రో, డీజిల్ ధరలు తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 16వ తేదీ వరకు ప్రతీరోజూ పెరుగుతూ వచ్చిన ధరలు.. 18వ తేదీ నుంచి స్వల్పంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.

news18-telugu
Updated: November 3, 2018, 6:18 PM IST
నేడు స్వల్పంగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలు..
ప్రతీకాత్మక చిత్రం..
news18-telugu
Updated: November 3, 2018, 6:18 PM IST
గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతూ వస్తున్న పెట్రో, డీజిల్ ధరలు శనివారం కూడా స్వల్ప మేర తగ్గాయి. పెట్రోల్‌పై 19 పైసలు, డీజిల్‌పై 11 పైసలు తగ్గింది. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.78.99, లీటరు డీజిల్ ధర రూ.73.53గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.84.49, లీటరు డీజిల్ ధర రూ.77.06గా నమోదైంది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల రేట్లు తగ్గడం వల్లే పెట్రో, డీజిల్ ధరలు తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 16వ తేదీ వరకు ప్రతీరోజూ పెరుగుతూ వచ్చిన ధరలు.. 18వ తేదీ నుంచి స్వల్పంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అంతకుముందు అక్టోబర్ 4న పెట్రో, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. అదే రోజు పెట్రో, డీజిల్‌పై కేంద్రం రూ.1.50మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.



First published: November 3, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...