వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు..

ప్రతీకాత్మక చిత్రం

Petrol Diesel prices hike: ముడి చమురు ఉత్పత్తులపై సౌదీ అరేబియా ఆంక్షలతో పెట్రోల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో.. రోజుకు 8లక్షల బారెల్స్‌కు మించి ప్రొడక్షన్ జరగకూడదని సౌదీ ఆంక్షలు విధించింది.

  • Share this:
    పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి. ఆదివారం పెట్రోల్ ధరలు 48 పైసలు నుంచి 60పైసలు పెరగ్గా.. డీజిల్ ధరలు 60 పైసలు నుంచి 75 పైసలు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.69.75, డీజిల్ ధర రూ.63.78గా ఉంది.

    దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ 48పైసలు పెరిగి 75.39గా ఉంది. అలాగే డీజిల్ ధర 66పైసలు పెరిగి రూ.66.66గా ఉంది. మిగతా నగరాలతో పోలిస్తే బెంగళూరులో పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. లీటరు పెట్రోల్ 51పైసలు పెరిగి రూ.72.04 కాగా, డీజిల్ ధర 61పైసలు పెరిగి రూ.65.78గా ఉంది.

    ఇక చెన్నై, కోల్‌కతాలలో పెట్రోల్ ధరలు లీటరుపై 48పైసలు నుంచి 53 పైసలు పెరిగాయి. చెన్నైలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.71.97, లీటరు డీజిల్ ధర రూ.65.46 గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోల్ రూ.72.40, లీటరు డీజిల్ ధర రూ.67.26గా ఉంది. ముడి చమురు ఉత్పత్తులపై సౌదీ అరేబియా ఆంక్షలతో పెట్రోల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో.. రోజుకు 8లక్షల బారెల్స్‌కు మించి ప్రొడక్షన్ జరగకూడదని సౌదీ ఆంక్షలు విధించింది.
    First published: