Home /News /national /

PETROL CARS BAD NEWS FOR PETROL CAR USERS REGISTRATION WILL BE CANCELED AFTER 15 YEARS EVK

Petrol Car: పెట్రోల్ కారు వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్‌.. 15 ఏళ్లు దాటితే అంతే!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Petrol Cars | మీరు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెట్రోల్ కారు ఉందా. అయితే వెంట‌నే మార్చుకోవాల్సిందే అంటుంది ఢిల్లీ ప్ర‌భుత్వం తాజాగా ఢిల్లీ ప్ర‌భుత్వం 15 ఏళ్లు నిండిన పెట్రోల్ కార్లపై కొత్త నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చింది.

    మీరు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెట్రోల్ కారు ఉందా. అయితే వెంట‌నే మార్చుకోవాల్సిందే అంటుంది ఢిల్లీ (Delhi) ప్ర‌భుత్వం తాజాగా ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఈ విధానంతో కొద్ది రోజుల్లో 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు చేస్తున్న‌ట్టు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం శనివారం లక్షకు పైగా 10 సంవత్సరాల పాత డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ (Registration))ను రద్దు చేసింది, వాటి యజమానులకు ఎలక్ట్రిక్ కిట్‌ (Electric Kit)లతో తిరిగి అమర్చడం లేదా నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందిన తర్వాత వాటిని ఇతర రాష్ట్రాల్లో విక్రయించడం వంటి అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాల  (Petrol Vehicle) aరిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఢిల్లీ రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

    ఢిల్లీలో 32 లక్షల ద్విచక్ర వాహనాలు, 11 లక్షల కార్లు సహా పాత పెట్రోల్ వాహనాల సంఖ్య 43 లక్షలకు పైగా ఉంటాయ‌ని అంచనా. రిజిస్ట్రేషన్‌ రద్దు చేసిన‌ 10 ఏళ్ల డీజిల్ వాహనం లేదా 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనం రోడ్లపై తిరుగితే సీజ్ చేసి స్క్రాపింగ్‌కు పంపిస్తామని ఢిల్లీ రవాణా శాఖ హెచ్చరించింది.

    NGO: "ఎన్‌జీఓ"ల‌పై కేంద్రం కొర‌డా.. విదేశీ విరాళాల‌పై ఆంక్ష‌లు!


    10 ఏళ్ల నాటి డీజిల్ వాహనాల యజమానులు రవాణా శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) పొందిన తర్వాత వాటిని ఎలక్ట్రిక్ కిట్‌లతో రీట్రోఫిట్ చేయడానికి లేదా ఇతర రాష్ట్రాల్లో విక్రయించడానికి ఇప్పుడు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    ప‌దిల‌క్ష‌ల డిజిల్‌ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ ర‌ద్దు..
    "నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (National Green Tribunal) ఆదేశాలకు అనుగుణంగా, జనవరి 1, 2022 నాటికి 10 సంవత్సరాలు నిండిన 1,01,247 డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. అలాంటి వాహనాల యజమానులు ఇతర వాటిల్లో తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే NOC కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చ‌ని అధికారులు తెలిపారు. రద్దు చేయబడిన డీజిల్ వాహనాల్లో దాదాపు 87,000 కార్లు ఉన్నాయి. మిగిలిన వాటిలో గూడ్స్ క్యారియర్లు, బస్సులు , ట్రాక్టర్లు ఉన్నాయి.

    Cryptocurrency: క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్ ఆఫీస్‌ల‌పై డీజీజీఐ దాడులు.. భారీగా ప‌న్ను ఎగొట్టినట్టు గుర్తింపు!


    పాత వాటి స్థానంలో ఎల‌క్ట్రిక్ వెహికిల్‌లు..
    NGT ఆదేశాల కారణంగా రోడ్లపై నడవలేని టూ మరియు త్రీవీలర్స్‌తో సహా పాత పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను రీట్రోఫిట్ చేయడానికి రవాణా శాఖ ఎనిమిది ఎలక్ట్రిక్ కిట్ తయారీదారులను ఎంప్యానెల్ చేసింది. ఇతర ఎలక్ట్రిక్ కిట్‌ల తయారీదారులతో కూడా డిపార్ట్‌మెంట్ చర్చలు జరుపుతోందని స‌మాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని ఎంప్యానెల్ చేస్తామని అధికారులు తెలిపారు. పాత డీజిల్, పెట్రోల్ కార్లు, నాలుగు చక్రాల వాహనాలను రీట్రోఫిట్ చేయడానికి బ్యాటరీ సామర్థ్యం, ​​పరిధిని బట్టి రూ.3-5 లక్షలు ఖర్చవుతుందని ఆటోమొబైల్ నిపుణులు తెలిపారు. రెండు, మూడు చక్రాల వాహనాలను రీట్రోఫిట్ చేయడం బ్యాటరీ రకం మరియు తయారీదారులను బట్టి తక్కువ ఖర్చు అవుతుందని వారు తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Cars, Delhi, Electric cars, Petrol

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు