Home /News /national /

Petrol Price Today: పెట్రోల్‌పై తగ్గుతున్న ట్యాక్స్.. వివిధ ప్రాంతాల్లో ఉన్న రేట్లు ఇవే.. ఆ నగరాల్లోనే తక్కువ.. ..

Petrol Price Today: పెట్రోల్‌పై తగ్గుతున్న ట్యాక్స్.. వివిధ ప్రాంతాల్లో ఉన్న రేట్లు ఇవే.. ఆ నగరాల్లోనే తక్కువ.. ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Petrol Diesel Price Today: పన్నులు తగ్గించిన తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.97కి దిగివచ్చింది. లీటర్ డీజిల్ రూ.86.67గా ఉంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్ తగ్గించలేదు.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించడంతో డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా తగ్గాయి. పెట్రోల్‌పై 50 శాతం, డీజిల్‌పై 40 శాతానికి పన్నులు తగ్గాయి. అనేక రాష్ట్రాలు వ్యాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్) కూడా తగ్గించడంతో ఇంధన ధరలు మరింత దిగివచ్చాయి. పన్నులు తగ్గించిన తరువాత దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ (Petrol) రూ.100 లోపే లభిస్తోంది.

పన్నులు తగ్గించిన తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.97కి దిగివచ్చింది. లీటర్ డీజిల్ రూ.86.67గా ఉంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం (Delhi )  వ్యాట్ తగ్గించలేదు. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.109.98గా ఉండగా, డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో సోమవారం లీటరు పెట్రోల్ ధరను రూ.104.67, డీజిల్ రూ.89.79గా నిర్ణయించారు. చెన్నైలో (Chennai) లీటరు పెట్రోల్ ధర రూ.101.40, డీజిల్ రూ.91.43గా ఉంది. భోపాల్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.107.23, డీజిల్ ధర రూ.90.87గా ఉంది.

పన్నులు తగ్గించక ముందు నవంబరు 1న, ఢిల్లీలో లీటరు పెట్రోలుపై రూ.32.90 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రూ.30 శాతం వ్యాట్ వసూలు చేశారు. మొత్తం ధరలో ఇది 54 శాతంగా ఉందని పీటీఐ కథనంలో తెలిపింది. పన్నులు తగ్గించిన తరువాత ఢిల్లీలో పన్నులు 50 శాతానికి తగ్గాయని పీటీఐ తెలిపింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొద్దిరోజుల కిందట ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారు. 2020లో లీటరు పెట్రోల్‌పై రూ.13, లీటరు డీజిల్‌పై రూ.16 పెంచి, తాజాగా స్వల్పంగా తగ్గించారని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్లోనూ ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి.

సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి. సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు ఉత్పత్తిదారు అరామ్‌కో సంస్థ తాజాగా క్రూడ్ ఆయిల్ ధరలను పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలకు ఉన్న డిమాండును ఇది సూచిస్తుంది.

ఈటల రాజేందర్ నెక్ట్స్ టార్గెట్ అదేనా ?.. వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా ?

Revanth Reddy: హుజూరాబాద్‌ విషయంలో రేవంత్‌రెడ్డి ఈ లాజిక్ మిస్సయ్యారా ?

* వివిధ నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
ముంబైలో సోమవారం లీటరు పెట్రోల్ ధర రూ.109.98 ఉండగా, డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.103.97కు దిగివచ్చింది. లీటర్ డీజిల్ రూ.86.67కు లభిస్తోంది.

కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధరను రూ.104.67, డీజిల్ ధరను రూ.89.79గా నిర్ణయించారు.

చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.101.40, డీజిల్ ధర రూ.91.43గా ఉంది.

భోపాల్‌లో లీటరు పెట్రోల్ రూ.107.23, డీజిల్ రూ.90.87 వద్ద లభిస్తోంది.

హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.108.20, డీజిల్ ధర రూ.94.62గా ఉంది.

బెంగళూరులో లీటరు పెట్రోల్ రూ.100.58, డీజిల్ రూ.85.01 వద్ద లభిస్తోంది.

చండీగఢ్‌లో లీటరు పెట్రోల్ రూ.100.12, డీజిల్ రూ.86.46 వద్ద.. గౌహతిలో పెట్రోల్ రూ.94.58, డీజిల్ రూ.81.29 వద్ద లభిస్తోంది.

లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.95.28, డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

గాంధీనగర్‌లో లీటరు పెట్రోల్ రూ.95.35, డీజిల్ రూ.89.33 వద్ద లభిస్తోంది.

తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.93.47, డీజిల్ ధర రూ.93.47గా ఉంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Diesel, Petrol

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు