హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Supreme Court: పురుషులే బాధితులు.. నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్

Supreme Court: పురుషులే బాధితులు.. నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్

సుప్రీంకోర్టు (File Image)

సుప్రీంకోర్టు (File Image)

Trending: వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు, గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆదేశించాలని కూడా పిటిషన్‌లో కోరారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గృహహింసకు గురై వివాహిత మగవారి ఆత్మహత్యలను పరిష్కరించేందుకు మార్గదర్శకాలను కోరుతూ 'నేషనల్ కమిషన్ ఫర్ మెన్' ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది మహేష్ కుమార్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. 2021లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) భారతదేశంలో ప్రమాదవశాత్తు మరణాలపై ప్రచురించిన డేటాను పేర్కొంటూ.. ఆ సంవత్సరం దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో 81,063 మంది వివాహిత పురుషులు కాగా, 28,680 మంది వివాహిత మహిళలు ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

2021 సంవత్సరంలో 33.2% మంది పురుషులు కుటుంబ సమస్యల కారణంగా, 4.8% మంది వివాహ సంబంధిత సమస్యల కారణంగా తమ జీవితాలను ముగించారని.. ఈ సంవత్సరంలో మొత్తం 1,18,979 మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. 45,026 మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌సిఆర్‌బి అందించిన డేటాను పిటిషన్‌లో ప్రస్తావించారు.

వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు, గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆదేశించాలని కూడా పిటిషన్‌లో కోరారు. గృహ హింస బాధితుల ఫిర్యాదును స్వీకరించడానికిప్రతి పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా సరైన మార్గదర్శకాలను జారీ చేయడానికి ఆదేశాలు జారీ చేయాలని అందులో కోరారు.

Covid Alert: పెరుగుతున్న కరోనా కేసులు.. ఆరు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక..!

Paper Leakage: ‘పేపర్ లీక్ మా తప్పే’’.. సీఎం కీలక ప్రకటన..

కుటుంబ సమస్యలు మరియు వివాహ సంబంధిత సమస్యల కారణంగా పురుషులు ఒత్తిడికి లోనవుతారని.. భారత ప్రభుత్వం సరైన చట్టాన్ని రూపొందించే వరకు ఈ అంవాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు పంపాలని కోరారు. గృహ హింస లేదా కుటుంబ సమస్యలు, వివాహ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వివాహిత పురుషుల ఆత్మహత్యల సమస్యపై పరిశోధన చేయడానికి భారత లా కమిషన్‌కు సిఫార్సును జారీ చేయాలని కోరారు. ఇలాంటి ఫోరమ్‌ను ఏర్పాటు చేయడానికి అవసరమైన నివేదికను రూపొందించాలని అన్నారు.

First published:

Tags: Supreme Court

ఉత్తమ కథలు