దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. చటాన్‌పల్లి వద్ద శుక్రవారం పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో దిశా హత్యాచార నిందితులు చనిపోయారు. సీపీ సజ్జనార్ కథనం ప్రకారం.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. తుపాకులు లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపారు. ఎంత వారించినప్పటికీ వాళ్లు వినకపోయేసరికి చివరకు పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ కాల్పుల్లో నిందితులు నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మరోవైపు జాతీయ మానవ హక్కుల సంఘం , పలు మహిళా సంఘాలు ఎన్‌కౌంటర్‌ను తప్పు పడుతున్నాయి. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుల్ని ఎలా చంపేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ NHRC టీమ్ హైదరాబాద్ వచ్చింది. మహబూబ్ నగర్లో నిందితుల మృతదేహాల్ని పరిశీలించిన తర్వాత చటాన్‌పల్లి నిందితుల్ని ఎన్కౌంటర్ జరిపిన స్థలానికి వెళ్లనుంది.
ఇటు నిందితుల గ్రామస్తులు కూడా తెలంగాణ పోలీసులు దిశ నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌ను బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్ట ప్రకారం శిక్షించకుండా అన్యాయంగా కాల్చిచంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్కౌంటర్ జరిగిన అనంతరం ప్రక్రియలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు గతంలో అభిప్రాయపడింది. దీని కొరకు ఐదేళ్ల కిందట పలు మార్గదర్శకాలను రూపిందించింది. వీటిని తప్పక పాటించాలని ఆదేశాలు జారీచేసింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.