PET REGISTRATION ALERT FOR PET LOVERS RS 1000 FINE FOR LATE REGISTRATION KNOW DETAILS EVK
Pet Registration: పెట్ ప్రియులకు అలర్ట్.. అక్కడ ఆలస్యం అయితే రూ.1,000 జరిమానా
ప్రతీకాత్మక చిత్రం
Pet Registration | దేశ రాజధానికి దగ్గరగా ఉండే నోయిడా (Noida) లో ఇప్పటికే పెట్ రిజిస్ట్రేషన్ యాప్‌ను ప్రవేశ పెట్టారు. అయితే పెట్ లవర్స్‌కు నోయిడా అథారిటీ కొత్త అలర్ట్ ఇచ్చింది. నోయిడాలో ఉన్నవారు ఫిబ్రవరి 14లోగా తమ పెంపుడు జంతువులను నమోదు చేయాలని స్పష్టం చేసింది.
జీహెచ్ఎంసీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (CDMA) అధికారులు తక్షణ పెంపుడు జంతువుల నమోదు కోసం మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఫిబ్రవరి నెలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. దేశ రాజధానికి దగ్గరగా ఉండే నోయిడా (Noida) లో ఇప్పటికే పెట్ రిజిస్ట్రేషన్ యాప్ (Pet Registration)ను ప్రవేశ పెట్టారు. దాని పేరు నోయిడా అథారిటీ పెట్ రిజిస్ట్రేషన్ (NAPR). ఈ రిజస్ట్రేషన్ యాప్‌లో పెంపుడు జంతువు ఫోటోను అప్లోడ్ చేసేలా రూపొందించారు. ఈ పెంపుడు జంతువుకు సంబంధించిన లైసెన్స్, ఫీజు చెల్లింపులు, నో అబ్జెక్షన్ లెటర్ (No Objection Letter) లో అన్ని ఈ యాప్ ద్వారానే నోయిడా అందిస్తోంది. అయితే పెట్ లవర్స్‌కు నోయిడా అథారిటీ కొత్త అలర్ట్ ఇచ్చింది.
ప్రత్యేక డ్రైవ్..
నోయిడాలో ఉన్నవారు ఫిబ్రవరి 14లోగా తమ పెంపుడు జంతువులను నమోదు చేయాలని స్పష్టం చేసింది. అలా చేయడంలో విఫలమైతే రూ. 1,000 వరకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నోయిడా అథారిటీ ఫిబ్రవరి 14 వరకు కుక్కలు, పిల్లులతో సహా పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్ కోసం డ్రైవ్ ప్రారంభించింది.
అంతేకాకుండా, నోయిడాలోని నివాసితులు తమ పెంపుడు జంతువులను నమోదు చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక రిజిస్ట్రేషన్ క్యాంపులను నోయిడాలోని హౌసింగ్ సొసైటీ (Housing Society) లు మరియు కాలనీలలో నిర్వహిస్తున్నారు. నోయిడా అథారిటీ గత ఏడాది సెప్టెంబర్‌లో పెంపుడు జంతువుల యజమానుల కోసం నోయిడా అథారిటీ పెట్ రిజిస్ట్రేషన్ (NAPR) యాప్‌ను ప్రారంభించింది.
నోయిడా పరిసరాల్లో కుక్క కాటు కేసులను నియంత్రించడానికి యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ని ప్లే స్టోర్ (Play Store) నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ యాప్‌లో, పెంపుడు జంతువు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసినా లేదా ఇబ్బంది కలిగించినా నివాసితులు ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో దేశీయ, విదేశీ జాతి కుక్కలు, పిల్లులు నోయిడాలోని నివాసితుల వద్ద ఉన్నట్టు గుర్తించారు. ఈ కారణంగా నోయిడా అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రయపై దృష్టి పెట్టారు.
మన రాష్ట్రంలో కూడా GHMC ఇప్పటికే పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లో మార్చింది. ఈ మొబైల్ యాప్ (Mobile APP) పెంపుడు జంతువుల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. ఇంతకుముందు పెంపుడు జంతువులను నమోదు చేసుకోవాలనుకునే వారు మున్సిపల్ కార్యాలయానికి నేరుగా వెళ్లాల్సి రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఆ సమస్య ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.