హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు...

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

నరేంద్ర మోదీ నాయకత్వంలో జమ్మూకాశ్మీర్ ప్రజలు అత్యున్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాసులు కూడా తమను భారత్‌లో కలపాలని డిమాండ్ చేస్తారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

    భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జమ్మూకాశ్మీర్ ప్రజలు అత్యున్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాసులు కూడా తమను భారత్‌లో కలపాలని డిమాండ్ చేస్తారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ‘కొంచెం ఆగండి. త్వరలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తమకు పాకిస్తాన్ పాలన వద్దని, తమను భారత్‌లో కలపాలని డిమాండ్ చేస్తారు. ఆ ఘటన జరిగిన రోజు మన పార్లమెంట్ లక్ష్యం కూడా నెరవేరినట్టు అవుతుంది.’ అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. జమ్మూకాశ్మీర్ జన్ సంవాద్ వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న రక్షణశాఖ మంత్రి ఈ కామెంట్స్ చేశారు. ‘కాశ్మీర్‌లో ఒకప్పుడు స్వాతంత్ర్యం కావాలంటూ పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ జెండాలు ఎగిరేవి. ఇప్పుడు కేవలం భారతీయ త్రివర్ణ పతాకం మాత్రమే ఎగురుతోంది.’ అని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండోసారి పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ జాతీయ నేతలు ఇలా వీడియో ర్యాలీలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Jammu and Kashmir, Pm modi, Rajnath Singh

    ఉత్తమ కథలు