Home /News /national /

PEOPLE OF HATIMURA VILLAGE MOURNED THEIR BELOVED BURHA BABAS DEATH AND OFFERED FLOWERS BEFORE HIS LAST RITES NK 2

అసోంలో ఏనుగు మృతి... విషాదంలో గ్రామం... ప్రేమతో అంత్యక్రియలు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Assam Elephant Death : ఏనుగు చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. మనిషి చనిపోతే బాధపడినట్లుగా... ఏనుగు మృతదేహంపపై పడి కన్నీళ్లు పెట్టారు.

అసోం... కాలియాబోర్ హాతీమురా గ్రామంలో... హాతీమురా బుర్హా బాబాగా పిలిచే ఏనుగుకు అంత్యక్రియలు నిర్వహించారు స్థానికులు. మూడేళ్లుగా ఆ గజరాజు... స్థానికులతో కలిసి మెలిసి జీవిస్తోంది. మూడేళ్ల కిందట ఆ మగ ఏనుగును ఓ రైలు ఢీకొట్టింది. కనీసం ఆహారం కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్న ఆ ఏనుగును స్థానికులు కాపాడారు. ఎప్పటికప్పుడు ఆహారం పెట్టి దాన్ని తిరిగి కోలుకునేలా చేశారు. సాధారణంగా ఇటీవల ఏనుగులు ఏజెన్సీల్లోకి వచ్చి... బీభత్సం సృష్టిస్తున్న ఘటనలు చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు తిరగబడి... ఏనుగులను అడవుల్లోకి తరిమేస్తున్నారు. ఈ ఘటనలో మాత్రం పూర్తి భిన్నం. ఏనుగును తమ సొంత ప్రాణిలా చూసుకున్నారు. దానికి హాతీమురా బుర్హా బాబా అని పేరు పెట్టుకొని... ప్రేమగా పెంచుకున్నారు.

ఊర్లో అందరి నోళ్లలో నానే హాతీమురా సడెన్‌గా చనిపోయింది. తెంగాబరీ ఏరియాలో అది విగతజీవిగా కనిపించింది. కజియారంగా ఫారెస్ట్ అధికారులు దానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అది చాలా వయసు మీరిందనీ, కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతూ చనిపోయిందని తేల్చారు.


ఏనుగు చనిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. మనిషి చనిపోతే బాధపడినట్లుగా... ఏనుగు మృతదేహంపపై పడి కన్నీళ్లు పెట్టారు. పిల్లలైతే... ఏనుగు దగ్గరే ఉండి... రోజంతా ఏడుస్తూనే ఉన్నారు. అందరూ పూలు చల్లుతూ అంత్యక్రియలు జరిపారు.

 

ఇవి కూడా చదవండి :

ప్రేయసి లేని లోకంలే బతకలేనంటూ... సూసైడ్ నోట్‌ రాసి...

మహిళపై గ్యాంగ్ రేప్... కల్వర్టు పక్కకు లాక్కెళ్లి...

జగన్ కాన్వాయ్‌ని అడ్డుకున్న మహిళ... ఎందుకో తెలుసా?

నెల్లూరులో టీడీపీ కార్యకర్త దారుణ హత్య... చేసిందెవరు?
First published:

Tags: Assam, Elephant attacks, Forest, VIRAL NEWS

తదుపరి వార్తలు