నెక్ట్స్ ప్రధానిగా మళ్లీ మోదీయే... ఆ సంస్థ సర్వే మాట

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... ఆ పీఠం ఎక్కి ఆరేళ్లు కూడా పూర్తవలేదు. అప్పుడే నెక్ట్స్ ప్రధాని ఎవరంటూ సర్వే జరిపితే... మళ్లీ ఆయనే ప్రధానిగా ఉండాలని ఫలితాలు రావడం విశేషం.

news18-telugu
Updated: January 24, 2020, 9:07 AM IST
నెక్ట్స్ ప్రధానిగా మళ్లీ మోదీయే... ఆ సంస్థ సర్వే మాట
ప్రధాని మోదీ
  • Share this:
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి చూస్తే అంతకంతకూ డౌన్ అవుతోంది. స్వచ్ఛభారత్, మేకిన్ ఇండియా వంటి నినాదాలు... మాటలకే పరిమితం అవుతున్నాయి. దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటే... అంత సీన్ కనిపించట్లేదు. అయినప్పటికీ... ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పోల్చితే.... ఇప్పటికీ ఆయనే సరైన ప్రధానిగా ప్రజలు భావిస్తున్నట్లు ఇండియా టుడే గ్రూప్‌-కార్వీ ఇన్‌సైట్స్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ (MOTN) సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... బీజేపీ పని అయిపోయినట్లే అని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటే... ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ సర్వే చేశారు. నెక్ట్స్ ప్రధాని అభ్యర్థులుగా నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీల్లో ఎవరిని ఎంచుకుంటారని అడిగితే... మోదీనే ఎంచుకుంటామని ప్రజలు చెబుతన్నారు. ఇద్దరికి మధ్య తేడా 40 శాతం దాకా ఉంది. అంటే... మోదీని 53 శాతం మంది కోరుకుంటుంటే... రాహుల్‌‌ను 13 శాతం మంది కోరుకుంటున్నారు. వీళ్లిద్దరూ కాకపోతే... సోనియా గాంధీని ప్రధానిగా చెయ్యొచ్చని 7 శాతం అన్నారు. ఇంకాస్త డీప్‌గా వెళ్తే... మొన్నటిదాకా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టవచ్చని 4 శాతం మంది కోరుకున్నారు. అటు రాహుల్ సోదరి ప్రియాంక గాంధీని ఆ సీటులో కూర్చోబెట్టాలని 3 శాతం మంది అభిప్రాయపడ్డారు.

పౌరసత్వ చట్టం, NRC, NPR, ఆర్టికల్ 370 వంటి అంశాలపై మతపరమైన విబేధాలు కొనసాగుతున్న సమయంలో... నరేంద్రమోదీనే ప్రధానిని చెయ్యాలంటూ.... 60 శాతం మంది హిందువులు, 17 శాతం మంది ముస్లింలు కోరుకుంటున్నారు. రాహుల్ రాహుల్‌ గాంధీని నిలబెట్టాలని 10 శాతం హిందువులు, 32 శాతం మంది ముస్లింలు భావిస్తున్నారు. మొత్తం 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ స్థానాల్లోని 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,141 మందిని ఇంటర్వ్యూ చేశారు. తద్వారా దేశం మూడ్ ఇదే అంటున్నారు. దేశం మొత్తం ఇదే మూడ్ ఉండకపోయినా... ఎంతో కొంత ఇదే తరహా మూడ్ ఉండొచ్చనే అభిప్రాయం ఉంది.

Published by: Krishna Kumar N
First published: January 24, 2020, 9:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading