Home /News /national /

PEOPLE FROM THE MUSLIM COMMUNITY SHOWER FLOWER PETALS ON DEVOTEES DURING THE HANUMAN JAYANTI PROCESSION IN BHOPAL PVN

Video : జై హనుమాన్ అంటూ..హ‌నుమాన్ శోభాయాత్ర‌లో పూల వర్షం కురిపించిన ముస్లింలు

హనుమాన్ శోభయాత్రలో పాల్గొని పూల వర్షం కురిపించిన ముస్లింలు

హనుమాన్ శోభయాత్రలో పాల్గొని పూల వర్షం కురిపించిన ముస్లింలు

Hanuman Jayanti procession : దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) మౌనం వహించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి.

Hanuman Jayanti procession in Bhopal : హ‌నుమాన్ శోభాయాత్ర‌లో ముస్లింలు(Muslims)పాల్గొని మ‌త‌సామ‌ర‌స్యం చాటుకున్నారు. శనివారం హనుమాన్‌ జయంతి సందర్భంగా భోపాల్ లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రలో ముస్లింలు కూడా పాల్గొని హ‌నుమంతుడిపై పూల వ‌ర్షం కురిపించారు. జై హ‌నుమాన్ అంటూ నిన‌దించి.. త‌మ భ‌క్తిని చాటుకున్నారు. భక్తులకు స్పీట్లు పంచారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో శనివారం భోపాల్(Bhopal)న‌గ‌రం కాషాయం జెండాల‌తో మెరిసిపోయింది. హ‌నుమాన్ శోభాయాత్ర(Hanuman Jayanti procession)నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా అన్ని షాపుల‌ను మూసి వేయించారు. ఈ శోభాయాత్ర‌లో సుమారు 5 వేల మంది భ‌క్తులు పాల్గొన్నారు.


మరోవైపు, హనుమాన్‌ జయంతి సందర్భంగా శనివారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన శోభాయాత్ర హింసాత్మకంగా మారింది. రెండువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘర్షణల్లో సాధారణ పౌరులతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారు. జహంగిర్‌పూరి ప్రాంతంలోని కుశాల్‌ సినిమా థియేటర్‌ దగ్గరకు రాగానే ఊరేగింపుపై కొందరు దుండగులు రాళ్లు విసిరేశారు. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో 9 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అందులో 8 మంది పోలీసులు, ఒక పౌరుడు ఉన్నాడ‌ని అధికారులు తెలిపారు. ఢిల్లీలో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో 9 మంది అరెస్ట్ అయ్యారు. వారిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. మ‌రో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హింసాకాండ‌కు సంబంధించి దాదాపు 100 సీసీ ఫుటేజీల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నామ‌ని.. ఈ సీసీ ఫుటేజీల ఆధారంగానే ఈ అల్ల‌ర్ల‌కు కార‌కులైన మ‌రికొంత మందిని గుర్తిస్తామ‌ని, అంతేకాకుండా స్పెష‌ల్ టీమ్‌, స్పెష‌ల్ సెల్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. హనుమాన్‌ ర్యాలీల నేపథ్యంలో జహంగీర్‌పురి సమీప ప్రాంతాలతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా చిన్నపాటి ఘర్షణలు జరిగాయని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రాకేష్‌ అస్తానా తెలిపారు. అదనపు బలగాలను పంపి పరిస్థితిని చక్కదిద్దినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు వార్తలను పౌరులు పట్టించుకోవద్దని సూచించారు.

ASLO READ Free Coaching : టీచర్ గా మారిన ఇంజినీర్..గంగా ఘాట్ వద్ద పేద విద్యార్థులకు ఫ్రీ కోచింగ్

ఇక,దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) మౌనం వహించడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. శ్రీరామ నవమి సందర్భంగా దేశంలోని పలు చోట్ల చోటుచేసుకున్న మత ఘర్షణలను హైలైట్‌ చేస్తూ 13 విపక్ష పార్టీలు(13 Opposition Parties) శనివారం రోజున సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. "దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన మత హింసాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. సంబంధిత వార్తలపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. సాయుధ మతపరమైన ఊరేగింపులు, రెచ్చగొట్టే ప్రసంగాల, మతపరమైన హింసకు దారితీస్తున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మతోన్మాదాన్ని ప్రచారం చేసే వాళ్ల మాటలను, వాళ్ల చర్యలను ఖండించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. ఆయన మౌనం.. ఇటువంటి ప్రైవేట్ సాయుధ గుంపులను అధికారికంగా ప్రోత్సాహించినట్లే అవుతుందని, వాళ్లు సంఘంలో విలాసాల్ని అనుభవిస్తున్నారనడానికి ఒక స్పష్టమైన సాక్ష్యంగా నిలిచిందని" విపక్షాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bhopal, Lord Hanuman, Muslim brothers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు