PEOPLE FIGHTING EACH ONE IN VILLAGE ON OCCASION OF DIWALI IN UP VRY
Diwali special : టపాసులు కాల్చడం కాదు.. అక్కడ కొట్టుకోవడమే దీపావళీ స్పెషల్..
Diwali special : టపాసులు కాల్చడం కాదు.. అక్కడ కొట్టుకోవడమే దీపావళీ స్పెషల్..
Diwali special : దీపావళీ ఉత్సవాలు దేశంలో ప్రాంతాలను బట్టి మారతాయి.. చాలా ప్రాంతాల్లో లక్ష్మి పూజలు చేస్తూ.. టపాసులు పేలుస్తారు.. కాని దేశంలోని ఓ ప్రాంతంలో మాత్రం దీపావళీ నాడు గ్రామస్థులంతా కలసి ఒకరినొకరు కొట్టుకుంటారు..
దేశంలోని పలు పండగలు ఓక్కో ప్రాంతంలో ఒక్కో సాంప్రదాయం ఆచారాలతో నిర్వహిస్తారు.. అయితే నిర్వహించే పండగ ఒక్కటే అయినా.. అక్కడ ఆచరించే పద్దతులే వేరుగా ఉంటాయి.. ఇలా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పద్దతులను పాటిస్తారు. కాగా దీపావళీ అంటే దేశంలోని చాలా ప్రాంతాల్లో లక్ష్మి పూజలు చేస్తూ... కుటుంబ సభ్యులతో టపాసులు పేల్చుతారు. మరికొంత మంది గిరిజన గూడాల్లో ప్రత్యేకంగా గుస్సాడి డాన్సులు చేస్తూ ప్రత్యేకంగా పండగను జరుపుకుంటారు. మరి కొన్ని చోట్ల దీపావళీ పండగనాడు లక్ష్మి దేవి రావాలని పూజలు చేస్తే.. మరి కొన్ని చోట్ల లక్ష్మి ఇంట్లో ఉండకూడదు అని పూజలు చేస్తారు.. ఇలా రకరకాలుగా దేవుళ్లను పూజించే కార్యక్రమాలు కొనసాగుతాయి..
కాని యూపిలోని ఓ ప్రాంతంలో మాత్రం దీపావళీకి ప్రత్యేక ఆచారం కొనసాగుతోంది. ఆ ప్రాంతాల్లో దీపావళీని కొందరు బందీఛోడ్ దివస్‌గా నిర్వహించుకుంటే, మరోచోట లాత్మార్ దీపావళిగా జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్‌ఖండ్‌లోని జలౌన్ గ్రామస్తులు కూడా ప్రతి ఏడాది లాత్మార్ దీపావళిని వేడుకగా జరుపుకుంటారు.
అంటే దీపావళి నాడు ఆ గ్రామంలో ఒకరినొకరు కర్రలతో కొట్టుకుంటారు. జలౌన్ గ్రామానికి చెందిన ప్రజలు ఎప్పటిలాగే లాత్మార్ దీపావళి చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే ముందుగా గ్రామస్తులంతా ఒకచోట చేరారు. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయి నృత్యాలు చేశారు. ఆపై ఒక గ్రూప్‌పై మరో గ్రూప్ కర్రలతో దాడి చేసుకున్నారు.కాగా, ఈ లాత్మార్ దీపావళి తాము అనాదిగా ఆచరిస్తున్నామని జలౌన్ గ్రామస్తులు తెలుపుదున్నిరు...కాగా ఈ ఉత్సవాల్లో పాల్గొనే వారంతా 30 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులే ఉంటారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.