• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • PENSION HIKE COMING SOON EPFO MEETING ON THIS DATE THESE DECISIONS MAY BE ANNOUNCED MS

EPFO : ఫించన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

EPFO : కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అగస్టు రెండో వారంలో ఈపీఎఫ్ఓ సమావేశం జరగనుంది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(EPS)లో సభ్యులుగా ఉన్నవారికి ఇచ్చే కనీస ఫించన్ మొత్తాన్ని పెంచడమే ప్రధాన అంశంగా ఈ సమావేశం జరగనుంది.

  • Share this:
    ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) త్వరలోనే కనీస ఫించన్ మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది. ఫించన్‌ను రూ.1000 నుంచి రూ.2000కి పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.పీఎఫ్ ఖాతాదారుల విజ్ఞప్తి మేరకు త్వరలోనే ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేట్లను కూడా పెంచే అవకాశం ఉంది.కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అగస్టు రెండో వారంలో ఈపీఎఫ్ఓ సమావేశం జరగనుంది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(EPS)లో సభ్యులుగా ఉన్నవారికి ఇచ్చే కనీస ఫించన్ మొత్తాన్ని పెంచడమే ప్రధాన అంశంగా ఈ సమావేశం జరగనుంది. ఈపీఎఫ్ఓ ప్రతిపాదనలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ(CBT) గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చు. ఫించన్ పెంపుకు ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక నిర్ణయానికి రాగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంది. పీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూర్చేలా 2018-19 సంవత్సరానికి గాను ప్రావిడెంట్‌ ఫండ్‌పై వడ్డీ రేటును 8.55% నుంచి 8.65% వరకు పెంచే యోచనలో ఈపీఎఫ్ఓ ఉంది. వడ్డీ రేటు పెంపు కోసం ఈపీఎఫ్ఓ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థికశాఖ కూడా ఆమోదం తెలిపినట్టు సమాచారం. పీఎఫ్ ఖాతాదారులకు అధిక వడ్డీ చెల్లించడం వల్ల సంస్థపై ఎలాంటి ప్రభావం ఉండబోదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.వడ్డీ రేట్లు పెంచినా.. సంస్థ ఖాతాలో మరో రూ.150కోట్లు ఉంటాయని అన్నారు.
    Published by:Srinivas Mittapalli
    First published: