PEGASUS SPYWARE RAHUL GANDHI COMMENTS ON SC ORDERS HE SAYS IT IS GOOD SIGN EVK
Pegasus Spyware : అప్పుడు మమ్మళ్ని అడ్డుకొన్నారు.. కానీ ఇప్పుడు.. : "సుప్రీం" ఉత్తర్వులపై రాహూల్‌గాంధీ హర్షం
రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
Pegasus Spyware : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిని పెగాసస్ స్పై వేర్ (Pegasus Spyware)తో ఫోన్ల హ్యాకింగ్ వ్య వహారంపై విచారణ కోసం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చి న ఉత్తర్వులను కాం గ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వాగతించారు. ఈ ఉత్తర్వులపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిని పెగాసస్ స్పై వేర్ (Pegasus Spyware)తో ఫోన్ల హ్యాకింగ్ వ్య వహారంపై విచారణ కోసం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చి న ఉత్తర్వులను కాం గ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వాగతించారు. ఈ ఉత్తర్వులపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పెగాసస్‌పై కమిటీ ఏర్పా టుతో మా పోరాటంలో గొప్ప అడుగు పడిందని ఆయన అన్నారు. దీంతో నిజానిజాలు బయటకు వస్తాయన్న నమ్మకం తమకు ఉందని రాహూల్ గాంధీ అన్నారు. దేశం, వ్యవస్థల కంటే ప్రధాని ఎక్కు వ కాదని ఆయన అన్నారు. మేం పార్లమెంట్ (Parliament) లో కేంద్ర ప్రభుత్వాన్ని పెగాసెస్ గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు సరికదా.. మమ్మ ల్ని అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు సుప్రీం ఉత్తర్వులతో మా వాదనకు బలం చేకూరిదని అన్నారు.
దేశం కన్నా ముఖ్యం కాదు..
‘‘పెగాసస్‌తో దేశ పౌరులపై నిఘా పెట్టి.. ప్రజాస్వా మ్యం (Democracy) పై దాడి చేశారని ఆయనో ఆరోపించారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీతో నిజాలు బయటకు వస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. . అసలు పెగాసెస్‌తో ఎవరి సమాచారాన్ని సేకరించారో చెప్పాలని అన్నారు. పెగాసస్‌తో వీరి సమాచారం ప్రధాని మోదీ, హోం మం త్రికి చేరిం దా? ఒకవేళ ఎన్నికల కమిషన్ (Election Commission), ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యా ప్ చేసి ఆ సమాచారాన్ని ప్రధానికి అందిస్తే.. అది పూర్తిగా నేరపూరిత చర్యే అవుతుందని ఆయన అన్నారు. దానిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
దేశం, వ్య వస్థ కం టే ప్రధాని ఏం ఎక్కు వ కాదు’’ అని రాహుల్ అన్నారు. ముఖ్య మంత్రులు, మాజీ ప్రధాని, భాజపా మంత్రులకు వ్య తిరేకంగా పెగాసస్‌ను ఉపయోగించారని రాహుల్ ఆరోపణలు గుప్పించారు.
సుప్రీం కోర్టు ఏం చెప్పింది..
- పెగాసెస్ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పా టు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడిం చిం ది.
- సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని కోర్టు పేర్కొంది.
- పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి స్థాయి నివేదికను కోర్టుకు
సమర్పిం చాలని కమిటీని ఆదేశించింది.
- దేశ పౌరులపై వివక్షాపూరితమైన నిఘాను తాము ఎన్నటికీ అనుమతిం చబోమని కోర్టు పేర్కొంది.
- టెక్నా లజీ ఎం త ముఖ్యమో.. వ్య క్తలు గోప్య త (Privacy) హక్కు ను కాపాడుకోవడం కూడా అంతే ప్రధానమనే విషయాన్ని మనమం తా గుర్తించాలని కోర్టు అభిప్రాయ పడింది.
- స్పై వేర్‌ను ఉపయోగించామా లేదా అన్న దానిపై కేం ద్రం నుంచి కచ్చితమైన సమాధానం రాలేదు. దేశ భద్రత పేరు చెప్పి సమాచారాన్ని ఇచ్చేం దుకు నిరాకరించిందని కోర్టు పేర్కొంది.
- పిటిషనర్లు చేసిన ఆరోపణలు వ్యక్తుల ప్రాథమిక హక్కుల (Fundamental Rights) ఉల్లంఘనకు సంబంధించినవిగా ఉన్నాయి. కేం ద్రం కూడా దీనిపై కమిటీ ఏర్పా టుకు సుముఖంగానే ఉంది. అందువల్ల కమిటీని ఏర్పాటు చేయడం తప్పి తే మరో అవకాశం కన్పిం చలేదని సుప్రీం కోర్టు వివరించింది.
- పెగసస్‌పై విచారణ జరపాలని వచ్చిన పలు వ్యాజ్యాలను పరిశీలించి విచారణ అనంతరం కోర్టు ఈ ఉత్తర్వులు వెలువడించింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.