హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi : అధికారం లేకుండా శాంతి అసాధ్యం..కార్గిల్ సైనికులతో మోదీ

PM Modi : అధికారం లేకుండా శాంతి అసాధ్యం..కార్గిల్ సైనికులతో మోదీ

కార్గిల్ లో మోదీ(Image credit : PMO Twitter)

కార్గిల్ లో మోదీ(Image credit : PMO Twitter)

PM Modi Diwali Message To Kargil Soldiers :   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఏటా పాటిస్తున్న సంప్రదాయ ప్రకారమే ఈసారి కూడా సరిహద్దు భద్రతా దళ సిబ్బందితో దీపావళి(Diwali) పండుగను జరుపుకొనేందుకు సోమవారం కార్గిల్(Kargil) చేరుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

PM Modi Diwali Message To Kargil Soldiers :   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఏటా పాటిస్తున్న సంప్రదాయ ప్రకారమే ఈసారి కూడా సరిహద్దు భద్రతా దళ సిబ్బందితో దీపావళి(Diwali) పండుగను జరుపుకొనేందుకు సోమవారం కార్గిల్(Kargil) చేరుకున్నారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎనిమిదేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు జవాన్లలో(Jawans) సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు వారితో కలిసి ఇవాళ ఉదయం కార్గిల్‌లో దీపావళి వేడుకలను ప్రధాని జరుపుకున్నారు. జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సైనికులనుద్దేశించిన మాట్లాడిన మోదీ...సైనికుల త్యాగాలను ప్రశంసించారు. దేశరక్షణలో సైన్యం సేవలు మరువలేనివని కొనియాడారు. దేశభక్తి అనేది దైవభక్తితో సమానమని తెలిపారు. ఆర్మీ బలగాలను చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. జవాన్లతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాని చెప్పారు. సైనికులను తన కుటుంబం అని, వారు లేకుండా తాను దీపావళిని జరుపుకోలేనని అన్నారు. సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు. తన దీపావళి తీపి, ప్రకాశం మీ మధ్య ఉంది అని వారితో చెప్పారు. దేశం సాధిస్తున్న పురోగతిని సైనికులకు వివరించారు మోదీ. దేశం అనేక సవాళ్లను ఎదుర్కొని గట్టిగా నిలబడిందన్నారు. అధికారం లేకుండా శాంతిని పొందడం అసాధ్యం అని కార్గిల్‌లో సైనికులకు ప్రధాని  చెప్పారు. అయితే తమ ప్రభుత్వం ఎప్పుడూ యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తుందని చెప్పారు.

" లంకలో జరిగినా, కురుక్షేత్రంలో జరిగినా చివరి వరకు యుద్ధాన్ని నిరోధించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. మేము ప్రపంచ శాంతికి అనుకూలంగా ఉన్నాము" అని మోదీ తెలిపారు. ఉగ్రవాదంపై సైనికుల పోరును కొనియాడారు. మన జవాన్ల ధైర్యానికి ద్రాస్, బటాలిక్, టైగర్ హిల్ సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. కార్గిల్‌లో మన సైనికులు తీవ్రవాదాన్ని అణిచివేశారని, ఆ ఘటనకు తానే సాక్షినని మోదీ అన్నారు. భారతదేశానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గౌరవం ఉందని..తాము భారత వ్యతిరేక శత్రువులపై కఠినమైన వైఖరిని తీసుకుంటున్నామని... సవాలు చేస్తే మన సాయుధ దళాలకు వారి సొంత భాషలో శత్రువులకు ఎలా తగిన సమాధానం ఇవ్వాలో తెలుసని ప్రధాని తెలిపారు.

కౌన్సిలర్లకు మంత్రి దివాళీ గిఫ్ట్..114గ్రాముల బంగారం, కిలో వెండి,లక్ష నగదు,పట్టు చీర..

ఉత్తరాఖండ్‌ సరిహద్దు గ్రామమైన మన (Mana)లో కూడా ప్రధాని పర్యటించి సరిహద్దు భద్రతా దళ సిబ్బందితో దీపావళి వేడుకల్లో పాల్గోనున్నారు. కాగా, గతేడాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి ప్రధాని దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఇక, సోమవారం ఉదయం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని ట్విట్టర్ వేదకగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభ తరుణంలో ప్రజలందరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు రెట్టింపు కాపాలని కోరుకుంటున్నానని...అందరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో అత్యద్భుతమైన దీపావళిని జరుపుకోవాలని ఆశిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్ లో తెలిపారు.

First published:

Tags: Diwali 2022, Jawan, Pm modi