PDPతో మీ పొత్తును తప్పిదంగా భావిస్తున్నారా... జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని అంచనా వెయ్యవచ్చు అన్న ప్రశ్నకు... న్యూస్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషితో ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పీడీపీతో పొత్తు ఓ ప్రయోగం అన్నారు మోదీ. కాశ్మీర్ ప్రజల తీర్పు ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వలేదన్న మోదీ... పీడీపీ, ఎన్సీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఎదురుచూసినట్లు ప్రధాని తెలిపారు. అలా జరగలేదన్న ఆయన... ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడం ప్రజాస్వామ్య విధానం అన్నారు. 2-3 నెలల తర్వాత సీనియర్ అయిన ముఫ్తీ సాహెబ్‌తో చర్చించామన్న మోదీ... ఇద్దరి సిద్ధాంతాలూ వేర్వేరు అయినప్పటికీ... బాధ్యతాయుతంగా చేతులుకలిపామన్నారు. ముఫ్తీ సాహెబ్ సమయంలో అది బాగానే వర్కవుట్ అయ్యిందన్న మోదీ... మెహబూబా ముఫ్తీ వచ్చాక పరిస్థితి మారిందన్నారు. ఆమె అయిష్టంగా ఉంటూ... 2-3 నెలలపాటూ ముందుకు రాలేదన్న మోదీ... ఫలితంగా గవర్నర్ పాలన తేవాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆమె తమ మద్దతు కోరగా ఇచ్చామన్న మోదీ... పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి... ఆమె వాటిని జరగనివ్వకుండా తాత్సారం చేశారనీ, అవి జరిగితే హింస చెలరేగుతుందని అన్నారని మోదీ తెలిపారు.
బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగిందన్న మోదీ... జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అసలు హింస అన్నదే లేదన్నారు. పక్షపాతంతో వ్యవహరిస్తున్న కొన్ని మీడియా సంస్థలు... అదే పనిగా కాశ్మీర్లో ఉగ్రవాద దాడుల్నే కవరేజ్ చేస్తున్నాయని మండిపడ్డారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలకు చూపించాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
రాఫెల్ ఆరోపణలు అవాస్తవం... నేను ఇప్పటికీ చౌకీదార్‌నే : ప్రధాని నరేంద్ర మోదీ
తల్లీ, కొడుకులు బెయిల్ తెచ్చుకొని... బయట తిరుగుతున్నారు: ప్రధాని మోదీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Jammu And Kashmir Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Mehbooba Mufti, Narendra modi