PDP CHIEF AND EX CM OF JAMMU KASHMIR MEHBOOBA MUFTI ADVOCATED TALK AMONG INDIA AND PAKISTAN ABOVE POLITICAL COMPULSIONS SK
భారత్, పాకిస్తాన్ సరిహద్దులో కాల్పుల మోత.. మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు
LoCలో పాకిస్తాన్ బంకర్లను ధ్వంసం చేసిన భారత్ ఆర్మీ
వాజ్‌పేయీ, ముషారఫ్ హయాంలో అమలు చేసిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించేందుకు ఇరు దేశాల నేతలు చర్చల్లో పాల్గొనాలని ట్విటర్లో పేర్కొన్నారు మెహబూబా ముఫ్తీ.
భారత్, పాకిస్థాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎల్వోసీ వెంంబడి కాల్పుల మోత మోగుతోంది. పాకిస్తాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. మోర్టార్ షెల్లింగ్‌తో రెచ్చిపోతున్నారు. భారత ఆర్మీ పోస్టులతో పాటు అమాయక పౌరులను టార్గెట్ చేస్తున్నారు. పాక్ కవ్వింపులకు భారత సైన్యం అంతకు మించిన స్థాయిలో ధీటుగా సమాధానం ఇస్తోంది. మాటకు మాట.. తూటకు తూటా.. అంటూ ఎదురు దాడి చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్, ఇండియా మధ్య ఉద్రిక్తలపై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల నేతలు చర్చించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాల్సిన అవసరం ఉందని మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. ఎల్ఓసీ వెంబడి జరిగిన కాల్పుల్లో ఇరుదేశాల సైనికులు మృతిచెందడం బాధాకరమని ఆమె అన్నారు. వాజ్‌పేయీ, ముషారఫ్ హయాంలో అమలు చేసిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించేందుకు ఇరు దేశాల నేతలు చర్చల్లో పాల్గొనాలని ట్విటర్లో పేర్కొన్నారు మెహబూబా ముఫ్తీ.
Sad to see mounting casualties on both sides of LOC. If only Indian & Pakistani leadership could rise above their political compulsions & initiate dialogue. Restoring the ceasefire agreed upon & implemented by Vajpayee ji & Musharaf sahab is a good place to start
శుక్రవారం భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎల్వోసీ వెండి ఇరుదేశాల సైన్యాల మధ్య భీకర కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. బారాముల్లా, దవార్, కీరన్, నౌగామ్, ఉరీ సెక్టార్లో భారత ఆర్మీ పోస్టులు, గ్రామాలే టార్గెట్‌గా పాక్ రేంజర్లు దాడి చేశారు. పాక్ దాడిలో ఐదుగురు భారత జవాన్లతో పాటు నలుగురు పౌరులు మరణించారు. ఐతే పాకిస్తాన్ రేంజర్ల కాల్పులకు భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. ఎదురు దాడి చేపి పాక్ ఆర్మీ బంకర్లు, సైనిక స్థావరాలు, ఆయుధ బంఢాగారాలను ధ్వంసం చేసింది. భారత్ సైన్యం ఎదురు దాడిలో 8 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు భారత సైన్యాధికారులు తెలిపారు. మరో 12 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎల్వోసీ వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.