తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టబోతోంది. తలైవా రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టడానికి నిర్ణయించారు. డిసెంబర్ 31న పార్టీని ప్రకటించనున్నారు. 2021 మేలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పోటీ చేస్తుందని సూపర్ స్టార్ ప్రకటించారు. తమిళనాట మార్పు రావాలని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ 69 ఏళ్ల రజినీకాంత్ ట్వీట్ చేశారు. దీంతో తలైవా అభిమానుల దశాబ్దాల కోరి ఇప్పటికి తీరనుంది. రజినీకాంత్ ప్రకటనతో ఆయన అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే, తమిళ రాజకీయాల్లోకి రజినీకాంత్ ఎంట్రీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రజినీకాంత్ రాజకీయాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రజనీకాంత్ రాజకీయాల్లోనే ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మంచి ఆశయంతో ఎవరు వచ్చినా దాన్ని స్వాగతించాలన్నారు. నివర్ తుఫాన్ బాధిత రైతులను పరామర్శించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను రిపోర్టర్లు రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించగా, జనసేనాని ఆ విధంగా స్పందించారు.
రెండు రోజుల్లో రెండు పెళ్లిళ్లు.. నాలుగు రోజుల తర్వాత ఏం జరిగిందంటే..!
విమానంలో సెక్స్, అమ్మకానికి లో దుస్తులు.. సోషల్ మీడియాలో ఎయిర్ హోస్టెస్ దుమారం
కాలేజీలో మ్యారేజీ.. లవ్ స్టోరీ వెనుక అసలు స్టోరీ ఏంటంటే
మరోవైపు తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులను ఆదుకోవాలన్నారు. తెలంగాణలో వరదలు వస్తే అక్కడి ప్రభుత్వం బాధితులకు రూ.10,000 చొప్పున సాయం చేస్తోందని, ఏపీలో ఎకరం పంట నష్టపోయే కనీసం రూ.25వేల నుంచి రూ.35వేల వరకైనా నష్టం వచ్చి ఉంటుంది కాబట్టి, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలన్నారు. డిసెంబర్ 4వ తేదీన శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటిస్తారు పవన్ కళ్యాణ్. అక్కడి రైతాంగాన్ని కలుస్తారు. అక్కడి నుంచి నాయుడు పేట, గూడూరుల్లో పర్యటించి నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan, Rajini Kanth, Rajinikanth, Rajni kanth, Rajnikanth, Tamil nadu