ఏడాది పాలన అద్భుతం... పవన్ కళ్యాణ్ అభినందనలు..

ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలన అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు.

news18-telugu
Updated: May 30, 2020, 2:10 PM IST
ఏడాది పాలన అద్భుతం... పవన్ కళ్యాణ్ అభినందనలు..
పవన్ కళ్యాణ్ Photo : Twitter
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలన అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు. ఏడాది పాలనలో ఎన్నో చరిత్రాత్మకమైన దిక్సూచిలాంటి నిర్ణయాలు తీసుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు. త్వరలో భారతదేశం స్వయం ఆధారితంగా మారుతుందని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ లాంటి ధైర్యం, విజనరీ ఉన్న నాయకుడి నేతృత్వంలో 21వ శతాబ్దం భారత్‌దే అవుతుందని అభిలషించారు. ‘ఈ ఏడాది దేశం ఎన్నో చరిత్రాత్మక మైన నిర్ణయాలను చూసింది. ఇక మన భారత్ త్వరలో స్వయం ఆధారిత దేశంగా మారుతుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ 21వ శతాబ్దం భారత్‌దే అవుతుంది.’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఎన్నో సంచలన, విజయవంతమైన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వంలో ఉన్న అందరికీ అభినందలు తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే రెండోసారి అధికారంలో కొనసాగుతోంది. 2019 మే 30న ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాదిలో ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది.

First published: May 30, 2020, 2:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading