బిల్లు కట్టలేదని పేషెంట్‌ను కొట్టి చంపిన ఆస్పత్రి...

కేవలం రూ.1000 ఆస్పత్రి బిల్లు కట్టలేదని రోగిని కొట్టి చంపారు ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది.

news18-telugu
Updated: July 3, 2020, 2:21 PM IST
బిల్లు కట్టలేదని పేషెంట్‌ను కొట్టి చంపిన ఆస్పత్రి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేవలం రూ.1000 ఆస్పత్రి బిల్లు కట్టలేదని రోగిని కొట్టి చంపారు ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సుల్తాన్ ఖాన్ అనే వ్యక్తికి గత కొన్ని రోజులుగా మూత్రం పోయడంలో ఇబ్బంది వస్తుందంటూ ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రి బిల్లు ఎంత అవుతుందని రోగితోపాటు వెళ్లిన బంధువు చమన్ ఆస్పత్రి సిబ్బందిని అడిగాడు. అందుకు వారు అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీసిన తర్వాత చికిత్సకు ఎంత ఖర్చవుతుందో చెబుతామన్నారు. అయితే, అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీయకుండానే ముందుగా మందుల కోసం రూ.5000 బిల్లు వేశారు. అందుకు వాళ్లు డబ్బులు చెల్లించారు.

అనంతరం మళ్లీ ఆస్పత్రిలో ఒకరోజు ఉన్నందుకు రూమ్ అద్దె రూ.4000 నుంచిరూ.5000 అవుతుందని చెప్పారు. అయితే, అంత డబ్బు తాము కట్టలేమని చెప్పిన తమను డిశ్చార్జ్ చేయాలని చెప్పారు. వారికి కట్టాల్సిన రూ.5000 కట్టి రోగి సుల్తాన్ ఖాన్‌ను తీసుకుని బయటకు వచ్చేశారు. అంతలో అక్కడికి వచ్చిన ఆస్పత్రి సిబ్బంది ఇంకా రూ.4000 ఇవ్వాలని గొడవపడ్డారు. తాము రూ.5000 ఇచ్చేశామని బాధితుడి బంధువు చమన్ స్పష్టం చేశాడు. ఇవ్వలేదని ఆస్పత్రి సిబ్బంది, ఇచ్చేశామని రోగి, అతడి బంధువు మాటామాటా పెరిగి చేయెత్తేవరకు వెళ్లింది. ఆస్పత్రి సిబ్బంది ఒకరు లోపలికి వెళ్లి తనతో పాటు మరికొందరిని తీసుకొచ్చాడు. వారి చేతిలో కర్రలు, ఇతర ఇనుప వస్తువులు ఉన్నాయి. వారు రోగి సుల్తాన్ మీద, అతడి బంధువు చమన్ మీద దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ దాడిలో సుల్తాన్ ఖాన్ చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
First published: July 3, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading