కొద్దినెలలుగా విమానాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలను కలవరపెడుతున్నాయి,ఆశ్చర్యపరుస్తున్నాయి. విమానాల్లో(Flight) ఇటీవల ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతుంది. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. విమానంలో మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించేసి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‍కు వస్తున్న విమానంలో ఇది చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా బయటికి వచ్చింది. ఇతర ప్రయాణికులు చిత్రీకరించిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి.
సోమవారం( జనవరి 23,2023) ఢిల్లీ-హైదరాబాద్ కు ఎస్‍జీ-8133 కొరెండోన్ విమానం.. ఢిల్లీలో బయలు దేరే సమయంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బంది పట్ల అనుచితంగా, వికృతంగా ప్రవర్తించారు. తనను ఓ వృద్ధ ప్రయాణికుడు అభ్యంతరకరంగా తాకారని ఓ మహిళా విమాన సిబ్బంది ఆరోపించింది. ఈ విషయాన్ని సదరు మహిళా క్యాబిన్ సిబ్బంది పీఐసీతో పాటు సెక్యూరిటీ స్టాఫ్‍కు ఫిర్యాదు చేశారు. విమానంలోని ఓ మహిళా ఉద్యోగితో ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణతో విమానంలో వాగ్వాదం కూడా జరిగింది. విమాన సిబ్బంది, ప్రయాణికుల మధ్య వాదన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా బయటికి వచ్చింది. క్యాబిన్ సిబ్బంది ప్రయాణీకులలో ఒకరితో వాగ్వాదానికి దిగడం.. ఆ తర్వాత మరొక ప్రయాణికుడు వాదనకు దిగడం ఆ వీడియోలో కనిపించింది. అయితే వాగ్వాదం తర్వాత సదరు ప్రయాణికుడిని, అతడికి మద్దతుగా వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మరో వ్యక్తిని ఢిల్లీలోనే విమానం నుంచి దింపేసి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు.. సిబ్బందిలోని ఒక మహిళను వృద్ద ప్రయాణికుడు అనుచితంగా తాకినట్టు ఆరోపించింది స్పైస్‌జెట్. దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆ ప్రయాణికుడు ఆ తర్వాత లిఖితపూర్వక క్షమాపణలు కూడా ఇచ్చారు. అయితే ఈ ఇబ్బందులు మళ్లీ తలెత్తకుండా ఆయనను విమానం నుంచి దించేశారుఅయితే ఈ ఘటన వల్ల 1.5 గంటల ఆలస్యమైందని ఆ విమాణంలో ప్రయానించిన ఒకరు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
#WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the Delhi-Hyderabad SpiceJet flight at Delhi airport today The passenger and & a co-passenger were deboarded and handed over to the security team at the airport pic.twitter.com/H090cPKjWV
— ANI (@ANI) January 23, 2023
2023లో ట్రిప్ కు ఫ్లాన్ చేస్తున్నారా?వీసా అక్కర్లేని ఈ 10 దేశాలకు వెళితే మస్త్ ఎంజాయ్
కాగా, గత ఏడాది నవంబరు 26 న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో మద్యం తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. బెంగుళూరులో శంకర్ మిశ్రాని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆ తరువాత శంకర్ మిశ్రా .. బాధితమహిళకు పరిహారం చెల్లించానని, తమ మధ్య వివాదం పరిష్కారమైందని అధికారులకు తెలిపాడు. అయితే ఇందులో తన క్లయింట్ తప్పేమీ లేదని, బాధిత మహిళే తనపై తాను మూత్రం పోసుకుందని మిశ్రా తరఫు లాయర్ కోర్టుకు తెలిపాడు. 30 ఏళ్లుగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన ఆమెకు ఇలాంటి సమస్య ఉండడం సహజమేనని అన్నాడు. ఈ కేసులో శంకర్ మిశ్రా ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఎయిరిండియా విమానంలో మూత్ర విసర్జన ఘటనను తీవ్రంగా పరిగణించిన పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) ఎయిరిండియాకి రూ. 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ విమాన పైలట్ ని మూడు నెలలపాటు సస్పెండ్ చేసింది. డైరెక్టర్ ఆఫ్ ఇన్-ఫ్లయిట్ సర్వీస్ కి 3 లక్షల ఫైన్ కూడా విధించినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.