PARROT FLEW AWAY FROM THE CAGE POLICE ENGAGED IN SEARCH PVN
Intresting : నా చిలుక మోసం చేసింది..పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఫిర్యాదు..రంగంలోకి దిగిన పోలీసులు
నమూనా చిత్రం
Parrot Missing Case : మాములుగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంటారు బాధితులు. అయితే నిత్యం తీరిక లేకుండా ఉండే పోలీసులకు అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన కేసులు వస్తుంటాయి.
Parrot Missing Case : మాములుగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంటారు బాధితులు. అయితే నిత్యం తీరిక లేకుండా ఉండే పోలీసులకు అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన కేసులు వస్తుంటాయి. తాజాగా అలాంటి విచిత్రమైన కేసు మరొకటి పోలీసుల వద్దకు వచ్చింది. ఓ వ్యక్తి తాను ప్రేమగా పెంచుకున్న చిలక మోసం చేసి ఎగిరిపోయిందని పోలీసులను ఆశ్రయించాడు. దాన్ని ఎలాగైనా వెతికిపెట్టాలని కోరాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్ పుర్ లో ఓ విచిత్ర కేసు నమోదైంది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చిలకను వెతికే పనిలో ఉన్నారు.
బస్తర్ జిల్లా జగదల్ పుర్ లో నివసించే మనీష్ ఠక్కర్ అనే వ్యక్తి ఓ రామచిలకను ఏడేళ్లుగా పెంచుకుంటున్నాడు. ప్రతిరోజు దానికి ఆహారం అందించి ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. కానీ గురువారం ఉదయం పంజరం తెరవగానే అది ఎగిరిపోయింది. మళ్లీ వెనక్కి తిరిగి రాలేదు. చుట్టుపక్కల అంతా తన చిలుక కోసం వెతికాడు మనీష్. అయితే అది ఎక్కడా కనిపించలేదు. దీంతో మనీష్...తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న రామచిలక వెన్నుపోటు పొడిచి పారిపోయిందని కోత్వాలీ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. ఏడు సంవత్సరాలుగా దాన్ని కుటుంబసభ్యురాలిగా చుసుకుంటున్నామని,నీ అది మాత్రం తనను మోసం చేసి ఎగిరిపోయిందని మనీష్ తెలిపారు. దాన్ని ఎలాగైనా వెతికిపెట్టాలని పోలీసులను మనీష్ కోరాడు. మనీష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిలకను వెతకడం ప్రారంభించారు. నగరంలోని సీసీటీవీలను పరిశీలించడం మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా చిలక జాడను గుర్తించి పట్టుకుంటామన్నారు.
మరోవైపు,ఇటీవల ఓ రైతు రూ. 180 విలువ చేసే తన చెప్పులు పోయాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విచిత్రమైన కేసు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ జిల్లా ఖాచ్రోడ్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. అయితే మొదట అతడు చెప్పింది విని కొందరు పోలీసులు నవ్వుకున్నారు. అతడు చెప్పింది విన్నాక షాకయ్యారు. చివరకు అతడి కంప్లైంట్ ను స్వీకరించారు. జితేంద్ర అనే రైతు గత శనివారం ఉదయం తన ఫ్రెండ్‌తో కలసి ఉజ్జయిన్ జిల్లా ఖాచ్రోడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి 180 రూపాయల విలువైన తన నల్లటి రంగు చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. తన చెప్పులను ఎత్తుకెళ్లడంలో కుట్ర దాగి ఉందని, దొంగ తన చెప్పులను వేరే నేరం చేసిన ప్రదేశంలో వదిలేస్తే తానే దోషినవుతానని జితేంద్ర పోలీసులకు చెప్పాడు. ఎవరో తనను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నట్టు అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశాడు. పైగా దీనికి సంబంధించి తన దగ్గరున్న కొన్ని సాక్ష్యాలను పోలీసులకు అందజేశాడు. అతడి దగ్గర సాక్ష్యాధారాలు తీసుకొని.. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఏ తప్పూ జరగదని జితేంద్రకు భరోసా ఇచ్చి పంపించారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.