పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఏర్పాట్లు.. ఎప్పటి నుంచంటే...

ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ కోసం అధికారులు లోక్‌సభ, రాజ్యసభలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభ్యులంతా భౌతిక దూరం పాటించేలా సీట్లను కేటాయించనున్నారు.

  • Share this:
    కరోనా కారణంగా వాయిదా పడిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుపై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సమావేశాలను నిర్వహించాలని యోచిస్తోంది. సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్‌ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ కోసం అధికారులు లోక్‌సభ, రాజ్యసభలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సభ్యులంతా భౌతిక దూరం పాటించేలా సీట్లను కేటాయించనున్నారు. ఉభయ సభల్లోనూ ఛాంబర్లు, గ్యాలరీలను కూడా సభ్యులకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో 60 మంది సభ్యులు ఛాంబర్‌లో, మరో 51మంది గ్యాలరీల్లో, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

    లోక్‌సభలోనూ ఇదే తరహా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్ బిర్లా జులై 17న సమావేశమై పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఛాంబర్లు, గ్యాలరీలను సైతం సభ్యులు కూర్చొనేందుకు వీలుగా ఉపయోగించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆగష్టు చివరి కల్లా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను వెంకయ్యనాయుడు ఆదేశించారు. ఈ క్రమంలోనే అధికారులు ఉభయ సభల్లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
    Published by:Shiva Kumar Addula
    First published: