పార్లమెంట్ సమావేశాలు కుదించే యోచనలో కేంద్రం?

ప్రస్తుత పార్లమెంటు భవనం

Monsoon Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 30 మంది ఎంపీలు కరోనా వైరస్ బారిన పడ్డారు.

  • Share this:
    Parliament Sessions: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 30 మంది ఎంపీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ క్రమంలో సమావేశాలను ఓ వారం ముందుగానే ముగించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 14న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 వరకు కొనసాగాల్సి ఉంది. 18 రోజుల పాటు జరగాల్సిన సమావేశాలు ఓ వారం ముందుగానే ముగించే అవకాశం ఉన్నట్టు పార్లమెంట్ సీనియర్ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సెషన్స్‌ను ఓ వారం తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 17 మంది లోక్‌సభ ఎంపీలు, 9 మంది రాజ్యసభ ఎంపీలు కరోనా బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా కారణంగా చనిపోయారు. అంతకుముందు ఏడుగురు కేంద్ర మంత్రులు, కొందరు ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు.

    ప్రతి రోజూ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ, తగ్గడం లేదు. ఏ రోజుకారోజు కొత్తగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా రోజుకు సుమారు లక్షకు దగ్గరగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన 93337 కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 53 లక్షలు దాటింది. 24గంటల్లో 1247 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 85619కి చేరింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డేటా ప్రకారం దేశంలో కరోనా రికవరీ రేట్ 78.86గా ఉంది. మరణాల శాతం 1.62గా ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: