పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల ఏర్పాటు... వివిధ కమిటీలకు తెలుగువారి నియామకం...

పార్లమెంటు భవనం

Delhi : వంద రోజుల పాలన పూర్తవడంతో కేంద్ర ప్రభుత్వం పాలనను మరింత వేగంగా పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వివిధ శాఖలకు స్టాండింగ్ కమిటీలను వేసింది.

  • Share this:
కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పాలన ఎలా ఉన్నా... పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను వెయ్యడం ద్వారా... శాఖల వారీగా మరింత జోరుగా పరిపాలన సాగించేందుకు కేంద్రం సిద్ధమైంది. అన్ని పార్టీల ఎంపీలనూ పరిపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తూ... స్టాండింగ్ కమిటీల్లో వివిధ పార్టీల ఎంపీలకు బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీల్లో చాలా వాటికి తెలుగు వారిని ఛైర్మన్లుగా నియమించడం చెప్పుకోతగ్గ విషయం. అలాగే... కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా చేర్చింది. ఇందుకు సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ స్నేహలత శ్రీవాస్తవ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. ఆయా కమిటీల ఛైర్మన్లు, సభ్యులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని కోరారు.

పార్లమెంటరీ శాఖల స్టాండింగ్ కమిటీలు - వాటి ఛైర్మన్ల వివరాలు :
వాణిజ్య శాఖ - విజయసాయిరెడ్డి
జాతీయ పరిశ్రమలు - కే కేశవరావు
రవాణా టూరిజం సాంస్కృతిక వ్యవహారాలు - ఛైర్మన్ టీజీ వెంకటేష్
సామాజిక న్యాయ శాఖ - రమాదేవి
హోంశాఖ - ఆనంద్ శర్మ
ఆర్థిక శాఖ - జయంత్ సిన్హా
రక్షణశాఖ - జువల్ ఓరం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - శశిథరూర్
విదేశాంగశాఖ - పీపీ. చౌదరి
శాస్త్ర సాంకేతిక వ్యవహారాలు - జయరామ్ రమేష్
మానవ వనరుల శాఖ - సత్యనారాయణ
వ్యవసాయ శాఖ - జి. గౌడర్
రైల్వేశాఖ - రాధామోహన్ సింగ్
గ్రామీణాభివృద్ధి - ప్రతాప్ జాదవ్
పట్టణాభివృద్ధి - జగదాంబికా పాల్
ఆరోగ్య కుటుంబ సంక్షేమ వ్యవహారాలు - రామ్ గోపాల్ యాదవ్
బొగ్గు ఉక్కు - రాకేష్ సింగ్
విద్యుత్ శాఖ - రాజీవ్ రంజన్ సింగ్
కార్మిక శాఖ - భర్తృహరి మెహతాబ్
కెమికల్ ఫర్టిలైజర్ - కనిమొళి
ఆహార వినియోగదారుల వ్యవహారాలు - సుదీప్ బందోపాధ్యాయ
సిబ్బంది వ్యవహారాలు న్యాయశాఖ - భూపేంద్ర యాదవ్
జలవనరులు - సంజయ్ జైస్వాల్
పెట్రోలియం నేచురల్ గ్యాస్ - రమేష్ బి దూరి
First published: