• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • PARLIAMENT WINTER SESSION CENTRAL GOVERNMENT CANCELS PARLIAMENT WINTER SESSION AND READY TO CONDUCT BUDGET SESSION IN JANUARY NK

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కేంద్రం సంచలన నిర్ణయం

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కేంద్రం సంచలన నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

Parliament Winter Session 2020: ఓవైపు త్వరలో పార్లమెంట్ కొత్త భవనం రాబోతోంది. ఇలాంటి సమయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాల (Budget Session)పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    Parliament Winter Session: ఎవరైనా ఎంపీలు... పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లాలనుకుంటే... వారు ఈ టూర్ రద్దు చేసుకోవచ్చు. ఎందుకంటే... ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగట్లేదు. రద్దు అయ్యాయి. కారణం ఏమీ లేదు కరోనాయే. ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గలేదు. పైగా ఢిల్లీలో మూడో వేవ్ నడుస్తోంది. అందువల్ల ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటూ... అన్ని పార్టీలూ... శీతాకాల సమావేశాలు రద్దు చేయడానికి ఒప్పుకున్నాయి. ఐతే... బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలో కాకుండా... జనవరిలోనే జరిపేద్దామని డిసైడ్ అయ్యాయి. అందువల్ల ఇక ఈసారికి శీతాకాల సమావేశాలు లేనట్లే. నిజానికి అవి ఉంటే... చాలా హాట్‌గా సాగేవని అనుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి కాబట్టి. ఐతే... కరోనా టెన్షన్ అలాగే ఉంది... ఎంపీల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు దాటిన వాళ్లే కావడంతో... రద్దు చేయడమే మంచిదనే అభిప్రాయం వినిపించింది.

    పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జ్యోషి... ఈ రద్దు విషయాన్ని నిర్ధారించారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి... కొంతకాలమైనా శీతాకాల సమావేశాలు జరపాలని డిమాండ్ చేసారు. దానికి సమాధానం ఇస్తూ... జ్యోషి... ఓ లేఖ పంపారు. దాన్లో సమావేశాలు లేవు అని తెలిపారు. జ్యోషి... స్వల్పకాల సమావేశాల్లో రైతుల సమస్యలు, కొత్త వ్యవసాయ చట్టాలపై మాట్లాడదామని కోరారు. సమావేశాలు రద్దయ్యాయి కాబట్టి... ఇక ఈ అంశం చర్చకు వచ్చేది జనవరిలో అనుకోవచ్చు.

    తాజా లెక్కలు, అంచనాల ప్రకారం జనవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు (Budget Session) ఉండనున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడతారని తెలిసింది. ఐతే... కొంత మంది కాంగ్రెస్ నేతలు... కరోనా జాగ్రత్తలతో శీతాకాల సమావేశాలు నిర్వహిద్దామని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలు, సరిహద్దుల్లో చైనా టెన్షన్లు, వాస్తవాధీన రేఖ సమస్యలు ఇలా చాలా అంశాలు చర్చించాల్సినవి ఉన్నాయని పట్టుపట్టారు. ఐతే... ఎంపీల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని కేంద్రం భావించినట్లు తెలిసింది. ఎందుకంటే... సెప్టెంబర్‌లో ఇలాగే తెగించి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిపారు. అంతే... కొంతమంది ఎంపీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో... సమావేశాల్ని త్వరగా ముగించేశారు.

    సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్‌లో జరుగుతాయి. బడ్జెట్ సమావేశాలు జనవరి చివరి వారంలో ప్రారంభమవుతాయి. రాజ్యాంగం ప్రకారం రెండు సమావేశాల మధ్య కాలం 6 నెలలు దాటకూడదు. ఆ ప్రకారమే జనవరిలో బడ్జెట్ సమావేశాలు జరపబోతున్నారని తెలిసింది.

    ఇది కూడా చదవండి:Fashion Trends: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్... డిజైనర్ కాస్ట్యూమ్స్‌తో సెలబ్రిటీ స్టైల్స్

    ఇంకా తగ్గని కరోనా:
    ఇండియాలో నిన్న కొత్తగా 22,065 కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 99,06,165కి చేరింది. అలాగే నిన్న 354 మంది కరోనాతో చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,43,709కి చేరింది. ప్రస్తుతం మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. నిన్న ఇండియాలో 34,477 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 94,22,636కి చేరింది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి... 95.1 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,39,820 ఉన్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు