Home /News /national /

Parliament Winter Session 2021: రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీల సస్పెన్షన్.. కార‌ణం ఇదే!

Parliament Winter Session 2021: రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీల సస్పెన్షన్.. కార‌ణం ఇదే!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Parliament Winter Session 2021: సోమవారం ఉదయం పార్లమెంట్ హౌస్ వద్ద కాంగ్రెస్ నిరసన తెలిపింది. ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంట్‌లో గంద‌ర‌గోళానికి కార‌ణ‌మైన 12 మందిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు స్పీక‌ర్ ప్ర‌కిటించారు.

    పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) సోమవారం ప్రారంభమయ్యాయి, ఈ సందర్భంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుతో సహా 26 బిల్లులు ప్రవేశపెట్టారు. ఈరోజు సమావేశానికి హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అలాగే కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ (Demand) చేస్తూ సోమవారం ఉదయం పార్లమెంట్ హౌస్ వద్ద కాంగ్రెస్ (Congress) నిరసన తెలిపింది. ఈ సంద‌ర్భంగా సభ ప్రారంభం నుంచి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పలు మార్లు సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మరోసారి గందరగోళం ఏర్పడడంతో రాజ్యసభ చైర్మన్‌ 12 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు.

    స‌స్పెండ్ అయిన ఎంపీలు వీరే..
    ఎలమరం కరీం (CPM), ఫూలో దేవి నేతమ్ (INC), ఛాయా వర్మ (INC), రిపున్ బోరా (INC), బినోయ్ విశ్వం (CPI), రాజమణి పటేల్ (INC), డోలా సేన్ (TMC),, శాంతా ఛెత్రి (TMC), సయ్యద్ నాసిర్ హుస్సేన్ (INC), ప్రియాంక చతుర్వేది (శివసేన), అనిల్ దేశాయ్ (శివసేన) మరియు అఖిలేష్ ప్రసాద్ సింగ్ (INC).

    వ్యవసాయ చట్టాలతో పాటు, క్రిప్టోకరెన్సీ, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు మరియు ఇతర బిల్లులు కూడా 19 పని దినాలతో కూడిన పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టబడతాయి. పార్ల‌మెంట్ సెష‌న్‌ డిసెంబర్ 23న  ముగుస్తుంది.

    PM Modi : అన్నిటికీ బదులిస్తాం.. కానీ ఆ విషయంలో జాగ్రత్త -ఇది చాలా ఇంపార్టెంట్.. అంతలోనే వాయిదా


    వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన 10 రోజుల వ్యవధిలోనే చట్టపరమైన ప్రక్రియ పూర్తికావొచ్చింది. సాగు చట్టాల రద్దు బిల్లు-2021 (Farm Laws Repeal Bill 2021)ను లోక్ సభ ఆమోదించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం నాడే సాగు చట్టాల రద్దు బిల్లును వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో ప్రవేశపెట్టగా.. భారీ మెజార్టీతో బిల్లు ఆమోదం పొందింది.

    సాగు చట్టాల రద్దు బిల్లుపై సభలో చర్చ జరపాలని, అసలా చట్టాలను కేంద్రం ఎందుకు తెచ్చిందో, ఎవరి కోసం తెచ్చిందో, తీరా ఎన్నికల ముందు ఎందుకు ఉపసంహరించుకుందో సమగ్రంగా చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సహా పలు విపక్షపార్టీలు పట్టుపట్టాయి. సాగు చట్టాలు చేసినప్పుడూ చర్చ చేయలేదు, కనీసం రద్దు బిల్లుపైన అయినా చర్చకు అనుమతించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ను కోరారు. అందుకు అనుమతి లభించకపోవడంతో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

    విపక్షాల అరుపులు, నినాదాలపై అధికార పక్షం నుంచి అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. ఉదాత్తమైన ఉద్దేశాలతో తీసుకొచ్చిన సాగు చట్టాలను కొందరు రైతులు సరిగా అర్థం చేసుకోలేకపోయినందున వాటిని రద్దు చేసుకుంటున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టత ఇచ్చారని, మోదీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పడమే సరిపోతుందని, అలాంటప్పుడు సాగు చట్టాల రద్దుపై సభలో చర్చ అనవసరమని అధికార బీజేపీ ఎంపీలు వాదించారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Bjp, Congress, Farm Laws, Indian parliament

    తదుపరి వార్తలు