హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Parliament: ఇప్పటి వరకు 24 మంది ఎంపీలు సస్పెండ్.. అందులో ముగ్గురు తెలంగాణ వారే

Parliament: ఇప్పటి వరకు 24 మంది ఎంపీలు సస్పెండ్.. అందులో ముగ్గురు తెలంగాణ వారే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Parliament : పార్లమెంట్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఉన్నారు. నిన్న మధ్యాహ్నం దామోదర్ రావు దీవకొండ, బి లింగయ్య యాదవ్, రవిచంద్ర వద్దిరాజును సస్పెండ్ చేశారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Parliament Monsoon Session) ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. జీఎస్టీ, ద్రవ్యోల్పణం, పెట్రోల్ గ్యాస్ ధరలు వంటి అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు. ప్లకార్డులు చేతిలో పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. రాజ్యసభ నుంచి ఇప్పటి వరకు 20 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. నిన్న 19 మందిపై వేటు పడగా..ఇవాళ ఆమాద్మీ ఎంపీ సంజయ్ సింగ్‌ను కూడా సభ నుంచి సస్పెండ్ చేశారు. గుజరాత్‌లో కల్తీ సారా తాగి 55 మంది మరణించారని.. దీనికి నరేంద్ర మోదీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన్ను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభ నుంచి సస్పెండ్ చేశారు.

రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల జాబితా ఇదే:

1. దామోదర్ రావు (TRS)

2. బి లింగయ్య యాదవ్ (TRS)

3. రవిచంద్ర వద్దిరాజు (TRS)

4. డోలా సేన్ (TMC)

5. శాంతాను సేన్ (TMC)

6. అభి రంజన్ బిస్వార్ (TMC)

7. మహ్మద్ నదీదుల్ హక్ (TMC)

8. ఎం హనమెద్ అబ్దుల్లా (DMK)

9. మౌసమ్ నూర్ (TMC)

10. AA రహీమ్ (CPI-M)

11. శాంత ఛెత్రి (TMC)

12. ఎస్ కళ్యాణసుందరం (DMK)

13. ఆర్ గిర్రంజన్ (DMK)

14. NR ఎలాంగో (DMK)

15. వి శివదాసన్ (CPIM-M)

16. M షణ్ముగం (DMK)

17. సుస్మితా దేవ్ (TMC)

18. సంతోష్ కుమార్ పి (CPI)

19. కనిమొళి (DMK)

అటు లోక్‌సభ నుంచి కూడా నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ అయ్యారు. వారిని ఈ వర్షాకాల సమావేశాలు ఉన్నంత వరకు వీరిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుంది.

1. మాణికం ఠాగూర్

2. TN ప్రతాపన్

3. జోతిమణి

4. రమ్య హరిదాస్

పార్లమెంట్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఉన్నారు. నిన్న మధ్యాహ్నం దామోదర్ రావు దీవకొండ, బి లింగయ్య యాదవ్, రవిచంద్ర వద్దిరాజును సస్పెండ్ చేశారు. వారిపై సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీలతో కలిసి ఆందోళన చేశారు.

మరోవైపు నేషనల్ హెరాల్ట్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ.. కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీని వాడుకుంటూ.. సోనియా గాంధీ ఫ్యామిలీపై కక్ష సాధింపులనకు పాల్పుడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Lok sabha, Monsoon session Parliament, Rajya Sabha

ఉత్తమ కథలు