హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Parliament : ఓటరు ఐడీకి ఆధార్ లింకు చట్ట విరుద్ధం.. బిల్లుపై విపక్షాలు.. మంత్రి మిశ్రా రాజీనామాకు పట్టు

Parliament : ఓటరు ఐడీకి ఆధార్ లింకు చట్ట విరుద్ధం.. బిల్లుపై విపక్షాలు.. మంత్రి మిశ్రా రాజీనామాకు పట్టు

పార్లమెంట్ సమావేశాలు అప్ డేట్స్

పార్లమెంట్ సమావేశాలు అప్ డేట్స్

ఆధార్ చట్టం ప్రకారం.. ఆధార్ కార్డును ఎన్నికల జాబితాకు అనుసంధానం చేయడం చట్ట విరుద్ధం అవుతుందని, కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల చట్టం(సవరణ) బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా, 12 మంది ఎంపీల సస్పెన్షన్ పైనా ఉభయ సభల్లో నిరసనలు కొనసాగాయి..

ఇంకా చదవండి ...

వారాంతపు సెలవుల తర్వాత సోమవారం పున:ప్రారంబమైన పార్లమెంటులో మళ్లీ నిరసనలు, గందరగోళం చెలరేగాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినా, సంచలన అంశాంలపై పార్లమెంటులో మాత్రం వేడి ఇంకాస్త రాజుకుంది. ఎన్నికల సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కీలక బిల్లును విపక్షాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. అదే సమయంలో లఖీంపూర్ హింసకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టేని రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. సస్పెన్షన్ కు గురైన 12 మంది ఎంపీల అంశంపైనా విపక్షాలు నిరసనలు చేపట్టాయి. మొత్తంగా సోమవారం లోక్ సభ, రాజ్యసభలు పలు మార్లు వాయిదా పడ్డాయి..

ఎన్నికల వ్యవస్థలో కీలక సంస్కరణగా, ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన విధంగా, దేశంలో ఓటరు జాబితాకు ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలనే నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ గత వారమే ఆమోదించింది. ఓటరు ఐడీకి ఆధార్ లింకుతోపాటు ఈసీకి మరిన్ని అధికారాలు కట్టబెట్టే అంశాలున్న ‘ఎన్నికల చట్టాలు(సవరణ) బిల్లు-2021’ని కేంద్రం సభ ముందుకు తెచ్చింది. కేంద్ర మంత్రి కిరన్ రిజిజు ఇవాళ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. సోమవారం లోక్ సభ ప్రారంభం కాగానే కాసేపు మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా, మరికాసేపు ఎలక్షన్ బిల్లులకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. సభ సజావుగా సాగని పరిస్థితిలో స్పీకర్ పలు మార్లు వాయిదా వేశారు.

Pushpa.. ఇంత దారుణమా? -భార్యాభర్తలు చెరోవైపు చేరి బాలికను నగ్నంగా పడుకోబెట్టి.. ఏళ్లపాటు..ఆధార్ చట్టం ప్రకారం.. ఆధార్ కార్డును ఎన్నికల జాబితాకు అనుసంధానం చేయడం చట్ట విరుద్ధం అవుతుందని, కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల చట్టం(సవరణ) బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానాన్ని కాంగ్రెస్ సహా దాదాపు విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. లోక్ సభ ప్రారంభం కావడానికి ముందు కూడా మంత్రి మిశ్రా రాజీనామా కోరుతూ విపక్ష ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు.

Hyderabad : పాపం పవిత్ర.. పెళ్లి చేసుకోవడం లేదనే మనస్తాపంతో అలా చేసిందే!అటు రాజ్యసభలోనూ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా అంశం, 12 మంది ఎంపీల సస్పెన్షన్ వ్యవహారంపై విపక్షాలు ఆందోళనకుదిగాయి. నిజానికి ఉభయ సభలు సజావుగా సాగేలా ప్రతిపక్షాల సహకారం కోరుతూ ప్రభుత్వం ఇవాళ(సోమవారం) ఒక సమావేశానికి పిలుపునిచ్చింది. కానీ ఎంపీల సస్పెన్షన్ ఎత్తేసేదాకా సర్కారుతో సంప్రదింపులు జరపబోమంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి స్పష్టం చేశారు.

Published by:Madhu Kota
First published:

Tags: Parliament Winter session

ఉత్తమ కథలు