Home /News /national /

PARLIAMENT MONSOON SESSION VICE PRESIDENT VENKAIAH NAIDU BREAKS DOWN OVER TUESDAYS RUCKUS IN RAJYA SABHA SK

Venkaiah Naidu: రాజ్యసభలో కంటతడి పెట్టిన వెంకయ్యనాయుడు..

వెంకయ్యనాయుడు (Image:ANI)

వెంకయ్యనాయుడు (Image:ANI)

Rajya sabha: ఇవాళ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం గానే.. ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. మంగళవారం సభలో చోటు చేసుకున్న పరిణామాలు, ఎంపీ అనుచిత ప్రవర్తన పట్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

  రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. సభలో ఎంపీల ప్రవర్తన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి పార్లమెంట్లో ఎంపీ టేబుల్స్‌పైకి నిరసన వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ఆయన కంటతడి పెట్టారు. గద్గద స్వరంతో మాట్లాడారు. చేతులు కూడా వణకుతూ కనిపించాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం గానే.. ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. మంగళవారం సభలో చోటు చేసుకున్న పరిణామాలు, ఎంపీ అనుచిత ప్రవర్తన పట్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

  ''ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయం లాంటింది.  కొందరు సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారు. చట్టసభల పవిత్రను దెబ్బతీశారు.  టేబుల్‌పై కూర్చున్నారు. మరికొందరు టేబుల్స్‌పై నిలబడ్డారు. పోడియం ఎక్కి నిరసన తెలపడమంటే గర్భ గుడిలో నిరసన తెలిపినట్లే.నిన్నటి పరిణామాలను తలచుకుంటే నిద్ర పట్టే పరిస్థితి లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణమం. సభలో ఇన్ని రోజుల పాటు కార్యకలాపాలను స్తంభింపజేయడం మంచిది కాదు. '' అని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాజ్యస సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

  మంగళవారం రాజ్యసభలో రచ్చ జరిగింది.  రైతుల సమస్యలపై చర్చ జరుగుతుండగా.. కొందరు సభ్యులు  వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు.  కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లని వస్త్రాలను సభలో ప్రదర్శించారు. రూల్‌ బేక్‌ని చింపేసి గాల్లోకి విసిరేశారు. కొందు ఎంపీలైతే  ఛైర్మన్ సీటుకు దిగువన పార్లమెంటరీ సిబ్బంది కూర్చొనే చోట.. టేబుళ్లపైకి ఎక్కి నిలబడ్డారు.  దాదాపు గంటన్నర సేపు అక్కడే బైఠాయించారు. పెద్దల సభగా చెప్పుకునే రాజ్యసభలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడాన్ని ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్రంగా తప్పుబట్టారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Rajya Sabha, Venkaiah Naidu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు