Home /News /national /

PARLIAMENT MONSOON SESSION 2022 BEGINS TODAY CENTRE TO PUT 24 BILLS TO REMOVE 71 OBSOLETE LAWS AMID OPPOSITION UPROAR MKS

Parliament Monsoon: వాడివేడిగా వర్షాకాల భేటీ -24 బిల్లులతో కేంద్రం.. అస్త్రాలతో విపక్షం.. నేటి నుంచే

నేటి నుంచి వర్షాకాల సమావేశాలు

నేటి నుంచి వర్షాకాల సమావేశాలు

మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చిన నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరగడం ఖాయంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ (జులై 18) సోమవారం ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికల (Presidential Election 2022) సందర్భంలో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చిన నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరగడం ఖాయంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session 2022) ఇవాళ (జులై 18) సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12వరకు కొనసాగనున్నాయి. ఈ సెషన్ లోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.

వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారమే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహిస్తారు. వర్షాకాల సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే కాలం చెల్లినవిగా పేర్కొంటూ 71 చట్టాలను తొలగించనున్నారు. ప్రతిపక్షాలు సహకరించినా, సహకరించకపోయినా రోజుకు రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

President Election 2022: 5PM వరకు పోలింగ్.. క్రాస్ ఓటింగ్‌కు బీజేపీ యత్నం..


మరోవైపు అధికార బీజేపీని నిలువరించి, నిలదీసేందుకు విపక్షాలు సైతం అస్త్రాలతో సిద్ధమయ్యాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్‌ పథకం తదితర అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి. చమురు, గ్యాస్‌ ధరలు, అగ్నిపథ్‌, రూపాయి విలువ పతనం, సరిహద్దుల్లో చైనాతో పెరిగిన ఉద్రిక్తతలు, ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు ఈడీ, సీబీఐ దాడులు, ప్రజాస్వామ్యం గొంతునొక్కే చర్యలపై ఈ సమావేశాల్లో తీవ్ర నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు సంఘటితమవుతున్నాయి.

సర్కారువారి సీక్రెట్స్ లీక్.. కేంద్రంపై CM KCR సంచలన ఆరోపణ.. PM Modi ఏడుపంటూ..


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఆదివారం నాడు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. 45 రాజకీయ పార్టీలను ఆహ్వానించగా, 36 పార్టీల ప్రతినిధులు మాత్రమే భేటీకి హాజరయ్యారు. ఉభయ సభల్లో 32బిల్లులు ప్రవేశపెట్టేందుకు వివిధ విభాగాలు సూచించాయని, వాటిలో 14 బిల్లులు సిద్ధంగా ఉన్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

Monsoon session: 18 నుంచి ఢిల్లీలో దబిడి దిబిడే -బీజేపీకి చుక్కలు చూపించేలా KCR ప్లాన్


అఖిలపక్ష భేటీలో ‘అన్‌పార్లమెంటరీ’ పదాల వివాదం, ధరల పెరుగుదల, అగ్నిపథ్‌ పథకం అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. సమావేశానికి ప్రధానిమోదీ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ యుద్ధ ప్రకటన తర్వాత తెలంగాణకు సంబంధించి ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో రగడ జరిగే అవకాశం ఉండటంతో కేంద్రం తెలివిగా గిరిజన యూనివర్సిటీని తెరపైకి తెచ్చింది.


TRS vs BJP : తిరిగి టీఆర్ఎస్‌లోకి ఈటల రాజేందర్? -కేటీఆర్ స్పందన -కేసీఆర్ మరో రికార్డు!


తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో ముందడుగు వేసిన కేంద్రం.. ఈ సమావేశాల్లోనే వర్సిటీ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈమేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, 2022ను కేంద్ర విద్యా శాఖ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమాచారమిచ్చింది.
Published by:Madhu Kota
First published:

Tags: Monsoon session Parliament, Parliament, Pm modi, President Elections 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు