Parliament Session: పార్లమెంట్‌లో ప్రతిపక్షాల రగడ. ఓర్వలేకపోతున్నారన్న ప్రధాని మోదీ

ఓర్వలేకపోతున్నారన్న ప్రధాని మోదీ

Parliament Monsoon Session 2021: అందరూ ఊహించినట్లే పార్లమెంట్ సమావేశాల్ని ప్రతిపక్షాలు గట్టిగానే అడ్డుకున్నాయి. చివరకు సభను వాయిదా వెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమన్నారు?

 • Share this:
  Parliament Session 2021: ఈ రోజు ఎప్పుడొస్తుందా... ఎప్పుడు ప్రభుత్వాన్ని నిలదీద్దామా అని ఎదురుచూసిన ప్రతిపక్షాలు... ఇవాళ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవ్వగానే... ఓ రేంజ్‌లో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కరోనా, రైతుల సమస్యలు ఇలా చాలా అంశాలపై లోక్ సభలో వివిధ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... సెటైర్లతో కూడిన విమర్శలు చేశారు. కొత్త మంత్రుల్ని సభకు పరిచయం చేద్దామనుకున్న ఆయన ఆలోచన సవ్యంగా ఆచరణలోకి రాకుండా పోయింది. సభలో విపక్షాల ఆందోళనలు ఎక్కువవ్వడంతో... సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు.

  ఆందోళనల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమన్నారంటే... "నేను అనుకున్నాను. సభలో చాలా ఉత్సాహ పూరిత వాతావరణం ఉంటుందని. ఎందుకంటే... ఈసారి చాలా మంది మహిళలు, దళితులు, గిరిజనులు మంత్రులు అయ్యారు. వ్యవసాయం, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వారు, OBC కమ్యూనిటీ వారికి మంత్రి పదవులు దక్కాయి." అని అనగానే... ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తాయి. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్నాయి.


  "దేశంలో మహిళలు, OBCలు, రైతుల కొడుకులు మంత్రులు అయితే కొంత మందికి నచ్చదు కాబోలు. అందుకే వాళ్లు కనీసం మంత్రులను పరిచయం చెయ్యడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు" అంటూనే మోదీ... ఆ ఆందోళనల మధ్యే కొత్త మంత్రులను లోక్‌సభకు పరిచయం చేశారు. ఇలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచే రణరంగంగా మారాయి అనుకోవచ్చు.

  2019లో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... తొలిసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిపి... 36 మంది కొత్త మంత్రులకు ఛాన్స్ ఇచ్చారు. ఐతే... కాంగ్రెస్, శిరోమణీ అకాళీ దళ్, సీపీఎం,... రైతు సమస్యలు, పెట్రోల్ ధరలు వంటి అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. చర్చకు పట్టుపట్టాయి. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే... స్పీకర్ ఓం బిర్లా... వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. "మీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువల్ని తగ్గిస్తున్నారు. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం" అని అన్నారు.

  ఇది కూడా చదవండి: కర్ణాటక పాలిటిక్స్ హీట్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఆడియో లీక్? యడ్యూరప్ప రాజీనామా చేస్తారా?

  ప్రధాని ప్రసంగం తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్... ప్రతిపక్షాలపై మండిపడ్డారు. "కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నది చాలా బాధాకరం, దురదృష్టకరం... కనీసం ప్రధాని తన కొత్త మంత్రుల్ని పరిచయం చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు." అని అన్నారు.


  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మోదీ... ఎంపీలు, రాజకీయ పార్టీలూ... "ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని కఠినమైన, తెలివైన ప్రశ్నలు అడగాలి. వాటికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. అది ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుంది. ప్రజలకు నిజాలు తెలుస్తాయి" అన్నారు.
  Published by:Krishna Kumar N
  First published: