PARIKSHA PE CHARCHA PARIKSHA PE CHARCHA TO BE HELD ON APRIL 1 RAJ BHAVANS TO HOST STUDENTS GH VB
Pariksha Pe Charcha : ఏప్రిల్ 1న జరగనున్న 'పరీక్షా పే చర్చ'.. విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వనున్న రాజ్ భవన్లు..
ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ
పరీక్షలపై విద్యార్థుల్లో ఉండే భయాన్ని, ఒత్తిడిని పోగొట్టేందుకు ఏటా 'పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha)' ఈవెంట్ ద్వారా విలువైన టిప్స్ పంచుకుంటున్నారు పీఎం నరేంద్ర మోదీ (Narendra Modi). అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1న ఢిల్లీలోని తల్కటోరా (Talkatora) స్టేడియంలో 'పరీక్షా పే చర్చ' ప్రోగ్రాం జరగనుంది.
పరీక్షలపై విద్యార్థుల్లో ఉండే భయాన్ని, ఒత్తిడిని పోగొట్టేందుకు ఏటా 'పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha)' ఈవెంట్ ద్వారా విలువైన టిప్స్ పంచుకుంటున్నారు పీఎం నరేంద్ర మోదీ (Narendra Modi). అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1న ఢిల్లీలోని తల్కటోరా (Talkatora) స్టేడియంలో 'పరీక్షా పే చర్చ' ప్రోగ్రాం జరగనుంది. ఈ ప్రోగ్రామ్ కు సెలెక్ట్ అయిన విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులకు దేశవ్యాప్తంగా ఉన్న రాజ్భవన్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ విషయాన్ని తాజాగా కేంద్రం ప్రకటించింది.
దీనిపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఎంపికైన స్టూడెంట్స్, టీచర్స్(Teachers), పేరెంట్స్(Parents) దేశవ్యాప్తంగా ఉన్న రాజ్భవన్లకు విచ్చేసి ఏప్రిల్ 1న జరగనున్న 'పరీక్షా పే చర్చ' ప్రోగ్రామ్ వీక్షిస్తారని వెల్లడించారు.
ఈ విషయంలో తాను సీఎంలు, గవర్నర్లకు లేఖ రాస్తున్నానని తెలిపారు. ఈవెంట్ గత ఎడిషన్లకు రాష్ట్రాలు సహకరించాయని, కాబట్టి ఇప్పుడు వాటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. 2018లో ‘పరీక్షా పే చర్చ’ ఈవెంట్ లాంచ్ చేశారు. కాగా ఈ ఏడాదిలో నిర్వహించేది ఈవెంట్ ఐదవ ఎడిషన్. గతేడాది కోవిడ్ వల్ల ఈ ఈవెంట్ ని ఆన్లైన్లో నిర్వహించాల్సి వచ్చింది. ఈ టౌన్ హాల్ అధికారిక కార్యక్రమం సెంట్రల్ ఫండ్ చేస్తున్న ఉన్నత విద్యాసంస్థలు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వైద్య, నర్సింగ్ కాలేజీలు.. స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోని ఎడ్యుకేషనల్ ఇన్స్ట్యూట్స్.. ప్రవాసులు ఎక్కువగా ఉన్న దేశాల్లోని భారతీయ మిషన్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
ధర్మేంద్ర ప్రధాన్ ప్రకారం, దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులు గవర్నర్ల సమక్షంలో ఈవెంట్‌ను చూడటానికి రాజ్భవన్లకు వస్తారు. డి-స్ట్రెస్ అవ్వడానికి పిల్లలకు ఎలాంటి అభ్యంతరం ఉండదని, అందుకే అన్ని రాష్ట్రాలు గతంలో కూడా ఈవెంట్ కి సహకరించాయని ప్రధాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నారు. ఈ ఈవెంట్ “ప్రజా ఉద్యమం” స్థాయికి పెంచడానికి ఈ చర్య సహాయపడుతుందని పేర్కొన్నారు. కేంద్రం తాజా ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాలు సానుకూల వైఖరి చూపిస్తున్నాయా అని అడిగిన ప్రశ్నకు.. "దీనికి విస్తృత మద్దతు లభిస్తుంద"ని తాను ఆశిస్తున్నానని ప్రధాన్ చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ కార్యదర్శి అయిన అనితా కర్వాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్యాశాఖ కార్యదర్శులతో సహా అధికారులతో ఈ ప్రణాళికపై చర్చించినట్లు ప్రధాన్ తెలిపారు.
తల్కతోరా స్టేడియంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాకు చెందిన 1000 మంది విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు కూడా ప్రధాని మోదీతో సంభాషించనున్నారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ప్రకారం, కేంద్రం నిర్వహించిన ఆన్లైన్ క్రియేటివ్ రైటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న 15.7 లక్షల మంది నుంచి విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ ఈవెంట్ దూరదర్శన్ (డీడీ నేషనల్, డీడీ న్యూస్, డీడీ ఇండియా), రేడియో ఛానెల్‌లు, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు పీఎం కార్యాలయం, విద్యా మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానెల్‌ల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.