ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ... విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెంచిన పీఎం

Pariksha Pe Charcha : పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని లైవ్‌లో చూసేందుకు వీలుగా చాలా స్కూళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యూట్యూబ్, దూరదర్శన్, ఆకాశవాణిలో లైవ్‌లో వచ్చింది.

news18-telugu
Updated: January 20, 2020, 2:05 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ... విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెంచిన పీఎం
నరేంద్ర మోదీ
  • Share this:
Pariksha Pe Charcha Programme : ఢిల్లీలోని... తల్కటోరా స్టేడియంలో ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలో పరీక్షా పే చర్చ కార్యక్రమం జరిగింది. ఇందులో... 2000 మంది విద్యార్థులు, టీచర్లూ పాల్గొన్నారు. వీళ్లలో కొందరు ప్రధాని మోదీని పరీక్షలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు. ఇందుకోసం గ్రాటిడ్యూట్ ఈజ్ గ్రేట్, మీ భవిష్యత్తు మీ ఆశయాల్లో, పరీక్షల పరిశీలన, మా విధులు-మీ నిర్వహణ, బ్యాలెన్స్ ఈజ్ బెనిఫీషియల్ వంటి థీమ్స్ ఎంపిక చేశారు. ఈ థీమ్స్ ఆధారంగా వేసే ప్రశ్నలకు మోదీ తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. మూడేళ్లుగా ప్రతీ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఉండే భయాలూ, టెన్షన్లను పోగొట్టే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ప్రతీ సంవత్సరం దీన్ని దూరదర్శన్, ఆకాశవాణిలో లైవ్ ప్రసారం చేస్తోంది. ఈసారి యూట్యూబ్‌లో కూడా లైవ్ ఇచ్చారు. అలాగే... దేశవ్యాప్తంగా చాలా స్కూళ్లలో దీన్ని లైవ్‌లో చూసేందుకు వీలు కల్పించారు.9 నుంచీ 12 తరగతులకు చెందిన 2000 మంది విద్యార్థుల్లో 1050 మందిని ఎస్సే కాంపిటీషన్ నిర్వహించి సెలెక్ట్ చేశారు. మిగతావారిని వేర్వేరు విధానాల్లో సెలెక్ట్ చేశారు. దేశవ్యాప్తంగా దివ్యాంగ స్కూళ్ల నుంచీ... 50 మంది దివ్యాంగ విద్యార్థుల్ని కూడా ఎంపిక చేశారు. వీళ్లంతా ప్రధాని నరేంద్ర మోదీతో డైరెక్టుగా ఇంటరాక్ట్ అయ్యారు. మోదీ చెప్పే విశేషాల్ని స్వయంగా విన్నారు.

గతేడాది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1.4 లక్షల ఎంట్రీలు రాగా... ఈసారి 2.6 లక్షల ఎంట్రీస్ వచ్చాయి. 2018లో మోదీ... 10 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 2019లో 16 ప్రశ్నలకు జవాబు ఇచ్చారు.
Published by: Krishna Kumar N
First published: January 20, 2020, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading