భరించలేకపోతున్నా.. నన్ను చనిపోనివ్వండి.. అమ్మ-నాన్నలపై రాష్ట్రపతికి బాలుడి లేఖ

ల్లిదండ్రుల గొడవలను భరించడం తనవల్ల కావట్లేదని తనువు చాలించడానికి అనుమతివ్వాలని లేఖలో పేర్కొన్నాడు.

news18-telugu
Updated: July 17, 2019, 12:40 PM IST
భరించలేకపోతున్నా.. నన్ను చనిపోనివ్వండి.. అమ్మ-నాన్నలపై రాష్ట్రపతికి బాలుడి లేఖ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తల్లిదండ్రులు నిత్యం గొడవపడటం ఆ టీనేజర్‌కి జీవితం మీద విరక్తి పుట్టేలా చేసింది. చదువుపై దృష్టి పెట్టలేక.. తల్లిదండ్రుల మధ్య గొడవలను ఆపలేక.. ప్రతీరోజూ నరకం అనుభవిస్తున్నాడు. ఇలా బతకడం కంటే చావడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశాడు. తాను ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని అందులో కోరాడు. దీంతో రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు దాన్ని పీఎంవో దృష్టికి తీసుకెళ్లాయి.దీంతో పీఎంవో వర్గాలు అధికారులను అవసరమైన చర్యలకు ఆదేశించాయి.లేఖ రాసిన ఆ టీనేజర్‌ జార్ఖండ్ నివాసి. అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాగా.. తల్లి బీహార్ రాజధాని పాట్నాలోని
బ్యాంకు ఉద్యోగి. ఇటీవల పీఎంవో కార్యాలయ వర్గాలు భాగల్‌పూర్‌ అధికారులకు దీనిపై సమాచారం చేరవేయడంతో వారు విచారణకు దిగారు.

తల్లిదండ్రుల గొడవలతో తానెంతగా విసిగిపోయాడో చెబుతూ ఆ బాలుడు లేఖ రాశాడు.అంతేకాదు, క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి తల్లి నుంచి బెదిరింపులను ఎదుర్కొంటున్నాడని తెలిపాడు.తల్లిదండ్రుల గొడవలను భరించడం తనవల్ల కావట్లేదని తనువు చాలించడానికి అనుమతివ్వాలని లేఖలో

పేర్కొన్నాడు.చిన్నతనంలో భాగల్‌పూర్‌లోని ఎన్టీపీసీలో ఉన్న తాతయ్య ఇంటి వద్ద ఆ బాలుడు పెరిగాడు.తాత రిటైర్మెంట్ తర్వాత దేవఘర్‌లో తండ్రితో పాటు ఉంటు చదువుకుంటున్నాడు. అయితే తల్లిదండ్రుల గొడవలు అతన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. బాలుడి తాతయ్య దీని గురించి మాట్లాడుతూ.. వారిద్దరు ఒకరిపై ఒకరు వివాహేతర సంబంధాల ఆరోపణలు చేసుకుంటున్నారని తెలిపారు. తమ కోడలు వల్లే కొడుకు జీవితం అలా తయారైందని.. ఆమెదే అసలు తప్పు అని అభిప్రాయపడ్డారు. వివరాలన్నీ సేకరించిన భాగల్‌పూర్ అధికారులు ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు.First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>