Para athlete sells ice cream : 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో సత్తా చాటాడు. 400 మీటర్ల పరుగు పందాన్ని కేవలం 1.15 సెకన్లలో పూర్తి చేసి కాంస్య పతకం సాధించాడు. ఎంతో గొప్ప పేరు సంపాదించాడు. మరిన్ని పతకాలను సాధించాలనుకున్నాడు. కానీ ఆశ నిరాశగా మిగిలిపోయింది. . అతడు క్రీడారంగంలో ఉన్నతస్థాయికి చేరాలని కన్న కలలు కనుమరుగయ్యాయి. ఫలితంగా ఆయ యువ క్రీడాకారుడు ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లు అమ్ముతూ బతుకుబండిని లాగుతున్నాడు. అతడే సంజయ్ సాహు.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజయ్ సాహు..పారా అథ్లెటిక్స్ ఛాంపియన్. చిన్ననాటి నాటి నుంచి క్రీడల్లో రాణించాలని,దేశానికి మంచి పేరు తీసుకురావాలని భావించేవాడు సంజయ్ సాహు. అయితే పేదరికంలో పుట్టడం వల్ల అతడు తలపెట్టిన ప్రతిపనిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా క్రీడారంగంలో రాణించాలన్న కోరికను వదిలిపెట్టలేదు. పేదరికంలో పుట్టిన సచిన్ సాహు నిజానికి 2015-2019 వరకు క్రికెట్ ఆడాడు. కానీ దివ్యాంగుడైన కారణంతో అంతగా రాణించలేకపోయాడు. ఈ క్రమంలో గ్వాలియర్ కి చెందిన అథ్లెటిక్స్ కోచ్ బీకే ధావన్ సాయంతో పారా అథ్లెట్ గా మారాడు. ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగిన 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో...400 మీటర్ల పరుగు పందాన్ని కేవలం 1.15 సెకన్లలో పూర్తి చేసి కాంస్య పతకం సాధించాడు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం సచిన్‌ని పట్టించుకోలేదు. తన ఆర్థిక పరిస్థితి కూడా అంతంతే కావడంతో బతుకు బండి నడిచేందుకు ఐస్ క్రీమ్ బండితో రోడ్డెక్కాడు. వీధుల్లో తిరుగుతూ ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నాడు.
ALSO READ Trains Cancelled : ప్రయాణికులకు బిగ్ అలర్ట్..రాబోయే 20 రోజుల పాటు 1100 ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశానికి మరిన్ని పతకాలు సాధించే సత్తా ఉన్నా ఆటగాడు.. ఇలా ఐస్ క్రీమ్స్ అమ్ముకోవడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినోళ్లకే మళ్లీ మళ్లీ కోట్ల రూపాయలు,ఖరీదైన లగ్జరీ కార్లు ఇవ్వడమే కాకుండా ఇలాంటోళ్లకు కొంచెం సాయమందిస్తే దేశాన్ని గర్వపడేలా చేస్తారని నెటిజన్లు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం సచిన్ ను గుర్తించి అతనికి తగిన ప్రోత్సాహం అందించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకుంటే.. భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి మరిన్ని పథకాలు తీసుకోస్తానని సచిన్ సాహు పేర్కొంటున్నాడు. మరోవైపు,గతంలో కూడా గొప్ప గొప్ప క్రీడాకారులు బతుకుబండి నడిచేందుకు వీధుల్లో సమోసాలు,ఐస్ క్రీమ్ లు అమ్ముకోవాల్సిన పరిస్థితిని మనం చూశాం. స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ కు రెండు పతకాలు సాధించిపెట్టిన అథ్లెట్ సీతా సాహు సైతం సమోసాలు అమ్ముకుంటున్న వైనం ఇటీవల వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 2011 ఏథెన్స్ స్పెషల్ ఒలింపిక్స్‌లో సాహు రెండు పతకాలు సాధించింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం ఆమెను పట్టించుకోకపోవడంతో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఆమెకు ఎదురైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh