బీజేపీ నేతల తీరుపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా మేల్కోవాలని..మహిళల సమాన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశరాజకీయలు రసవత్తరంగా మారాయి. నేతల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరింది. పదునైన విమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని వేెడెక్కిస్తున్నారు నేతలు. కొందరు నేతలు నోరుజారి చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'పప్పూ కీ పప్పీ' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో చేయడంతో రాజకీయ దుమారం రేగుతోంది.
తాను ప్రధాని అవుతానని పప్పూ (రాహుల్) చెబుతున్నాడు. మాయావతి, అఖిలేష్యాదవ్తో పాటు ఇప్పుడు 'పప్పూ కీ పప్పీ' (ప్రియాంక గాంధీని ఉద్దేశించి) కూడా వచ్చారు. ప్రియాంక గాంధీ ఇంతకుముందు మన దేశానికి చెందిన మహిళ కాదా? ఇక్కడ జన్మించలేదా? ఆమె కాంగ్రెస్ కుమార్తె కాదా? ఇప్పుడు కొత్తగా ఆమె వచ్చి చేసేదేముంది?
— మహేశ్ శర్మ, కేంద్ర సాంస్కృతిక శాఖమంత్రి
యూపీలోని సికందరాబాద్లో బీజేపీ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన మహేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్నాటక సీఎం కుమారస్వామిని కూడా ఆయన వదల్లేదు. మమతా కథక్ ఆడినా, కర్ణాటక సీఎం కుమారస్వామి పాట పాడినా ఎవరు చూస్తారంటూ ఎద్దేవా చేశారు. దేశంలో నరేంద్ర మోదీని మించిన నేత మరొకరు లేరని ప్రశంసలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమావ్యక్తం చేశారు మహేశ్.
కాగా, బీజేపీ నేతల తీరుపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా మేల్కోవాలని..మహిళల సమాన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించకూడదని ట్విటర్లో పేర్కొన్నారు.
Disgraceful remarks by the BJP ministers against women of our country ... Get up people of India, act n revolt for the better and equal future for the women of our country. These misogynist remarks n thought process needs to be decimated n changed forever . pic.twitter.com/2FJryKgcCL
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.