పాఠ్యపుస్తకాల్లోని చరిత్రలో మార్పులు చేర్పులు.. సలహాలు స్వీకరిస్తున్న పార్లమెంటరీ ప్యానెల్

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో చరిత్రపూర్వ సూచనలు గుర్తించడంతో పాటు భారతీయ చరిత్రలో కాలాలకు సంబంధించిన ప్రాతినిద్యాన్ని సరిదిద్దడానికి పార్లమెంటరీ కమిటీ పని చేస్తోంది.

 • Share this:
  భారతదేశంలోని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో దేశం ప్రథమ స్థానంలో ఉండాలని 1975 అత్యవసర పరిస్థితులు, 1998లో నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలకు తగిన ప్రాతినిధ్యం లభించాలని బీజేపీ ఎంపీ, విద్యా మంత్రిత్వ శాఖ కమిటీ చైర్మన్ వినయ్ సహస్రబుద్ధే న్యూస్18తో అన్నారు. దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో చరిత్రపూర్వ సూచనలు గుర్తించడంతో పాటు భారతీయ చరిత్రలో కాలాలకు సంబంధించిన ప్రాతినిద్యాన్ని సరిదిద్దడానికి పార్లమెంటరీ కమిటీ పనిచేస్తోంది.

  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇప్పుడు ఈ అంశంపై వాటాదారులతో పాటు సాధారణ ప్రజల నుంచి సలహాలు కోరుతోంది. ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు ఈ అంశంపై ఆసక్తి ఉన్న వాళ్లు జూన్ 30లోగా తమ సలహాలను సమర్పించాలని పిలుపునిచ్చారు, అయితే కోవిడ్ -19 రెండవ వేవ్ కారణంగా కొంతమంది నిపుణులు తమ సలహాలను ఇవ్వలేకపోయారు. ఈ కారణంగా వారు తమ సలహాలను సమర్పించడానికి గడువును జూలై 15 వరకు పొడిగించాలని హౌస్ ప్యానెల్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర నిపుణులు జూలై 15 లోపు ఈ మెయిల్ ద్వారా ఇంగ్లీష్ లేదా హిందీలో తమ సలహాలను ఇవ్వమని కోరింది.

  ఇందుకు సంబంధించిన నివేదిక దాదాపుగా పూర్తి కావొచ్చిందని.. అయితే కొంతమంది సూచనలు ఇవ్వడానికి గడువును పొడిగించాలని అభ్యర్థించారని ప్యానెల్ తెలిపింది. మరోవైపు రాజ్యసభ సచివాలయం(కమిటీ విభాగం) జారీ చేసిన గత నోట్‌లో పాఠశాల పాఠ్యపుస్తకాల్లో సంస్కరణలు ఉన్నాయి. చరిత్రపూర్వ వాస్తవాలకు సంబంధించిన సూచనలు, మన జాతీయ వీరుల గురించి వక్రీకరణలను పాఠ్యపుస్తకాల నుండి తొలగించడంతో పాటు అన్ని కాలాలకు సమానమైన లేదా దామాషా సూచనలు భారతీయ చరిత్ర, గొప్ప చారిత్రక వీర మహిళల పాత్రను హైలైట్ చేస్తుంది. గార్గి, మైత్రేయి లేదా ఝాన్సీ రాణి, రామ్ చన్నమ్మ, చంద్ బీబీ మరియు జల్కారి భాయీ వంటి పాలకులు ఈ జాబితాలో ఉన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: