Chandrayaan-2 : చిన్నారుల అభినందనలకు ఇస్రో పులకింత

ISRO Chandrayaan 2 : ఇప్పటివరకూ భూమి చుట్టూ తిరుగుతూ... మెల్లమెల్లగా భూమికి దూరం అవుతూ సాగిన చంద్రయాన్-2... ఇప్పటి నుంచీ భూమికి దూరంగా... చందమామకు దగ్గరగా వెళ్లబోతోంది. ఈ సందర్భంగా కేరళ విద్యార్థులు ఇస్రోకు అభినందనలు తెలిపారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 7, 2019, 11:07 AM IST
Chandrayaan-2 : చిన్నారుల అభినందనలకు ఇస్రో పులకింత
ఇస్రోకు విద్యార్థుల అభినందనలు (Image : Twitter - ISRO)
Krishna Kumar N | news18-telugu
Updated: August 7, 2019, 11:07 AM IST
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంగా సాగుతోంది. భూ కక్ష్యను పెంచే క్రమంలో చివరిదైన ఐదో ప్రయత్నాన్ని విజయవంతంగా ముగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఫలితంగా ప్రస్తుతం భూమికి దూరం అవుతూ... చందమామకు దగ్గరవుతూ చంద్రయాన్-2 పయనిస్తోంది. భూమికి 276 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ పయనిస్తోంది. ఈ నెల 14న తెల్లవారు జామున మాడ్యూల్‌ను చందమామ కక్ష్యలోకి పంపిస్తారు. ఈ సందర్భంగా... కేరళ పాలక్కడ్‌లోని... పాలక్కడ్ అప్పర్ ప్రైమరీ విద్యార్థులు ఇస్రోకు శుభాకాంక్షలు తెలుపుతూ... ఓ నోట్ పంపారు. ఈ నోట్‌ని పరిశీలించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల అభినందన పత్రాన్ని... ట్విట్టర్‌లో ఇస్రో అకౌంట్‌లో షేర్ చేశారు.


సెప్టెంబర్ 1 వరకూ చంద్రయాన్-2 మాడ్యూల్... ట్రాన్స్ ల్యూనార్ ఇంజక్షన్‌లో చంద్రుడి చుట్టూ తిరగనుంది. సెప్టెంబర్ 2న చంద్రయాన్-2 మాడ్యూల్ నుంచీ ఆర్బిటర్ విడిపోనుంది. ఆ తర్వాత ఆర్బిటర్‌ను చందమామకి 100 కిలోమీటర్ల ఎత్తులో గుండ్రంగా తిరిగేలా చెయ్యనున్నారు. 7 వరకూ చందమామ కక్ష్యలో తిరిగే ల్యాండర్‌ను... చంద్రుడి సౌత్ పోల్ పై దింపి... అందులోంచీ రోవర్ కిందకు దిగేలా చేస్తారు.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...