హోమ్ /వార్తలు /జాతీయం /

భారత్‌ గగనతలంలోకి పాకిస్థాన్ ఫైటర్ జెట్స్... కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

భారత్‌ గగనతలంలోకి పాకిస్థాన్ ఫైటర్ జెట్స్... కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

పాక్ ఫైటర్ జెట్‌ను కూల్చేసిన భారత సైన్యం

పాక్ ఫైటర్ జెట్‌ను కూల్చేసిన భారత సైన్యం

కాసేపట్లో పాక్ జాతీయ కమాండ్ అథారిటీ సమావేశంలో యాక్షన్ ప్లాన్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆదేశం పార్లమెంట్ సంయుక్త సమావేశం కూడా ఇవాళే జరగనుంది.

  భారత వైమానిక దాడులతో పాక్ రగిలిపోతుంది. కవ్వింపు చర్యలకు కాలు దువ్వుతోంది. ఈరోజు రాజౌరీ సెక్టార్‌లోకి పాకిస్థాన్ ఫైటర్ జెట్స్ ప్రవేశించాయి. పలు ప్రాంతాల్లో బాంబుల్ని జార విడిచాయి. దీంతో భారత సైన్యం కాల్పులకు దిగడంతో పాక్ యుద్ధ విమానలు తోక ముడిచినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో పాక్ జాతీయ కమాండ్ అథారిటీ సమావేశంలో యాక్షన్ ప్లాన్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఆదేశం పార్లమెంట్ సంయుక్త సమావేశం కూడా ఇవాళే జరగనుంది.


  పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానం రాజౌరి జిల్లాలోని నదియన్, లాల్ ఝాంగర్, కెర్రితో పాటు పూంచ్ జిల్లాలోని హమీర్ పూర్ ప్రాంతాల్లో బాంబులు వేసినట్లు స్థానికులు తెలిపారు. పాకిస్తాన్ విమానం మంటల్లో కాలిపోతూ కింద పడిన దృశ్యాలను తాము చూసినట్లు వెల్లడించారు. ఆ విమానాన్ని భారత వైమానిక దళం సుఖోయ్ యుద్ధ విమానంతో కూల్చేసినట్లు సమాచారం.


  మరోవైపు భారత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఐబీ, రా అధికారులు పాల్గొన్నారు. ఉదయం షోపియాన్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌తో పాటు.. సరిహద్దుల్లో పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. లేహ్, జమ్ము, శ్రీనగర్, పటాన్ కోట్,ఎయిర్ బేస్‌లో భారత భద్రతా అధికారులు హైఅలర్ట్ విధించారు. కాశ్మీర్ వ్యాప్తంగా విమానాల రాకపోకలు బంద్ చేశారు.  First published:

  Tags: India, Indian Air Force, Indian Army, Pakistan, Pulwama Terror Attack

  ఉత్తమ కథలు