అక్రమంగా భారత్‌లోకి చొరబడే యత్నం.. పాకిస్తానీ హతం..

news18-telugu
Updated: July 15, 2019, 11:11 AM IST
అక్రమంగా భారత్‌లోకి చొరబడే యత్నం.. పాకిస్తానీ హతం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన 60 ఏళ్ల ఓ పాకిస్తానీని బీఎస్‌ఎఫ్ భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.కశ్మీర్‌లోని సాంబా జిల్లా చక్ ఫకీరా ప్రాంతంలో ఉన్న భారత్-పాక్ సరిహద్దును దాటి అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన అతన్ని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. మొదట అతన్ని లొంగిపోవాలని భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేయగా.. అతను పట్టించుకోలేదు. అయినప్పటికీ లొంగిపోవాలని మరికొన్నిసార్లు హెచ్చరించారు. అప్పటికీ అతను పట్టించుకోకపోవడంతో కాల్చి చంపారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

అంతకుముందు శనివారం శ్రీనగర్‌లో ఉగ్రవాదులకు,భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులను తిప్పికొట్టాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>