భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన 60 ఏళ్ల ఓ పాకిస్తానీని బీఎస్ఎఫ్ భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.కశ్మీర్లోని సాంబా జిల్లా చక్ ఫకీరా ప్రాంతంలో ఉన్న భారత్-పాక్ సరిహద్దును దాటి అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన అతన్ని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. మొదట అతన్ని లొంగిపోవాలని భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేయగా.. అతను పట్టించుకోలేదు. అయినప్పటికీ లొంగిపోవాలని మరికొన్నిసార్లు హెచ్చరించారు. అప్పటికీ అతను పట్టించుకోకపోవడంతో కాల్చి చంపారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
అంతకుముందు శనివారం శ్రీనగర్లో ఉగ్రవాదులకు,భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులను తిప్పికొట్టాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.