భారత్‌లో చొరబాటుకు పాక్ కమాండోల యత్నం...గుజరాత్ తీరంలో హైఅలర్ట్

ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని అన్ని పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

news18-telugu
Updated: August 29, 2019, 2:55 PM IST
భారత్‌లో చొరబాటుకు పాక్ కమాండోల యత్నం...గుజరాత్ తీరంలో హైఅలర్ట్
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కుక్క తోక వంకరలా పాకిస్తాన్ బుద్ధి కూడా మారడం లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌లో విధ్వంసానికి కుట్రలు చేస్తోంది. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ఓ వైపు విఫలయత్నం చేస్తూనే... మరోవైపు ఉగ్రవాదుల చొరబాటుకు తోడ్పాటును అందిస్తోంది. కశ్మీర్లో భద్రతా దళాల సెక్యూరిటీ పెరగడంతో గుజరాత్ తీరంపై కన్నేసింది. సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ కమాండోలు, ఉగ్రవాదులను పంపించేందుకు ప్లాన్ చేస్తోంది. భారత భూభాగంలోకి పాక్ కమాండోలు చొరబడే ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌‌, సర్‌ క్రీక్‌ ప్రాంతం నుంచి పాక్‌ స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ (SSG) కమాండోలు, ఉగ్రవాదులు పడవల ద్వారా దేశంలోకి చొరబడే అవకాశముందని భద్రతా దళాలకు సమాచారం అందించాయి. ఇండియన్ నేవీ నౌకలపై దాడులు చేసేందుకు వీరికి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గుజరాత్ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తమై పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని అన్ని పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గోవా తీరంలోనూ భద్రతను పెంచారు.First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com