హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Dasara వేళ దాడులకు దుష్ట పన్నాగం -Delhiలో Pakistan ఉగ్రవాది అరెస్ట్ -రాకేశ్ ఆస్థానా ప్రకటనపై..

Dasara వేళ దాడులకు దుష్ట పన్నాగం -Delhiలో Pakistan ఉగ్రవాది అరెస్ట్ -రాకేశ్ ఆస్థానా ప్రకటనపై..

ఢిల్లీలో పాక్ టెర్రరిస్ట్ అరెస్ట్

ఢిల్లీలో పాక్ టెర్రరిస్ట్ అరెస్ట్

Pakistan Terrorist Arrested In Delhi : దసర వేడుకలో అదును చూసుకుని దాడులు చేసేలా టెర్రరిస్టులు వేసిన పథకాన్ని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్ జాతీయుడైన టెర్రరిస్టును ఇవాళ ఢిల్లీలో అరెస్టు చేశారు. సీపీ రాకేశ్ ఆస్థానా చెప్పిన వివరాలివి..

ఇంకా చదవండి ...

దేశ ప్రజల దసరా సంబురాలను భగ్నం చేయడానికి దాయాది పాకిస్తాన్ దుష్టపన్నాగం రచించింది. అదృష్టవశాత్తూ మన పోలీసులు ఆ కుట్రను ముందే పసిగట్టి భగ్నం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన ఉగ్రవాది పట్టివేతకు సంబంధించి పోలీస్ కమిషన్ రాకేశ్ ఆస్థానా వివరాలు వెల్లడించారు.

ఢిల్లీ నగరంలో తలదాచుకున్న పాకిస్తాన్ ఉగ్రవాది ఒకడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దసరా పండుగ సందర్భంగా దాడులు చేసేందుకే అతను ఇక్కడికొచ్చినట్లు సీపీ రాకేశ్ ఆస్థానా చెప్పారు. ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం పాక్ జాతీయుడిని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది.

లక్ష్మీనగర్ రమేష్ పార్కు వద్ద ఉగ్రవాదిని అరెస్టు చేసిన పోలీసులు, అతని గది నుంచి ఏకే -47 రైఫిల్, 60 రౌండ్ల తూటాలు, ఒక హ్యాండ్ గ్రెనెడ్ , రెండు అధునాతీన పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాది పేరు మొహ్మద్ అష్రఫ్ అని, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని నరోవాల్ అతని స్వస్థలమని పోలీసులు చెప్పారు.

పాక్ టెర్రరిస్టు అష్రఫ్ నకిలీ గుర్తింపుతో భారతీయుడిగా చెలామణి అవుతూ ఢిల్లీలో నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు. కాగా, పాక్ ఉగ్రవాది అరెస్టుతో ఢిల్లీ లో పెద్ద ఉగ్రదాడి ప్లాన్ ను నిలువరించగలిగామని సీపీ రాకేశ్ ఆస్థానా చెప్పుకున్నారు. అష్రఫ్ పై యూఏపీఏ చట్టం, ఆయుధాలు, పేలుడు పదార్థాల చట్టం కింద కేసులు పెట్టి రిమాండ్ కుతరలించారు. కాగా,

పట్టుపడిన టెర్రరిస్టు అష్రఫ్.. స్లీపర్ సెల్ సభ్యుడని, పాకిస్తాన్ లోని అతని చిరునామాను కూడా వెల్లడించిన పోలీసులు.. అతను ఏ గ్రూప్ కు చెందినవాడనేది మాత్రం వెల్లడించలేదు. ఢిల్లీలో అష్రఫ్ కు సహకరించినవాళ్లెవరు? ఏం ప్లానింగ్ చేశాడు? అనే వివరాలూ తెలియాల్సి ఉంది.

Published by:Madhu Kota
First published:

Tags: Delhi, Delhi police, Pakistan, Terrorists

ఉత్తమ కథలు