ఓ వైపు లద్దాఖ్ సరిహద్దులో చైనా చెలరేగి పోతుంటే.. మరోవైపు ఎల్‌వోసీ వెంబడి కవ్వింపులకు పాల్పడుతోంది పాకిస్తాన్. గూడఛర్య డ్రోన్‌లో ఆయుధాలను పంపి ఎల్‌వోసీ దాటిస్తోంది. శనివారం తెల్లవారుజామున భారత గగన తలంలోకి వచ్చిన పాక్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ కూల్చివేసింది. కథువాలోని పన్సార్ ప్రాంతంలో అనుమానాస్పద డ్రోన్ డ్రోన్ కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన బోర్డర్ సెక్యూరిటీ విభాగం.. దాడి చేసి దాన్ని కూల్చేసింది. భారత భూభాగంలో డ్రోన్ పడిపోయింది. పాకిస్తాన్ స్పై డ్రోన్‌ను స్వాధీనం చేసుకొని.. తనిఖీ చేయగా అందులో ఆయుధాల బయటపడ్డాయి. ఐతే డ్రోన్‌లో ఆయుధాలను పెట్టి భారత్ వైపు డ్రోన్‌ను ఎందుకు పంపించారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Jammu & Kashmir: Weapons recovered from the Pakistani drone shot down by Border Security Force (BSF) personnel in Kathua today. https://t.co/GP0wTMvGCU pic.twitter.com/R1Hl0Ah4Kp
— ANI (@ANI) June 20, 2020
డ్రోన్లలో ఆయుధాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధాలను కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులకు అందించేందుకు పంపించారా? లేదంటే పాకిస్తాన్ భూభాగంలో కూర్చొనే తుపాకులను ఆపరేట్ చేసి.. భారత ఆర్మీ, బీఎస్ఎఫ్ పోస్టులపై దాడికి కుట్ర చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై భారత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్‌వోసీ వెంబడి డ్రోన్ కదలికల నేపథ్యంలో సరిహద్దుల్లో నిఘాను మరింత పటిష్టం చేసింది భారత సైన్యం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BSF, Indian Army, Jammu and Kashmir, Pakistan